Bandi Saroj Kumar: మెగా హీరో సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన బండి సరోజ్ కుమార్

చివరిగా మోగ్లీ సినిమాలో విలన్ గా భయపెట్టిన పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ మళ్లీ కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ఛప్రి'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bandi Saroj Kumar: మెగా హీరో సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన బండి సరోజ్ కుమార్
Bandi Saroj Kumar

Updated on: Nov 15, 2026 | 4:15 PM

ఇండిపెండెంట్ ఫీచర్ ఫిల్మ్‌గా విడుదలైన ‘మాంగళ్యం’ సినిమాతో యూట్యూబ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు బండి సరోజ్ కుమార్. ఆ తర్వాత ‘నిర్భంధం’, ‘పరాక్రమం’ తదితర సినిమాలతోనూ పబ్లిక్ స్టార్ గా పాపురల్ అయ్యాడు. రా అండ్ రస్టిక్‌గా వాస్తవిక సమాజానికి దగ్గరగా ఉండే కథలు, పాత్రలతో సినిమాలను తెరకెక్కించడం బండి సరోజ్ కుమార్ ప్రత్యేకత. ఇతని యాక్టింగ్, మేకింగ్, టేకింగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సహజంగా ఈ నటుడి సినిమాల్లో కథ, కథనం, డైలాగ్స్, పాటలు, ఎడిటింగ్, దర్శకత్వం, పాటలు.. ఇలా అన్నీ బాధ్యతలు బీఎస్కేనే చూసుకుంటాడు. అయితే ఆ మధ్యన కాస్త డిఫరెంట్ గా సుమ కనకాల కుమారుడు రోషన్ సినిమా ‘మోగ్లీ’లో విలన్ గా ఆకట్టుకున్నాడు. దీని తర్వాత ఇప్పుడు మళ్లీ ‘ఛప్రి’ అనే మరో కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడీ పబ్లిక్ స్టార్. ఈ సినిమాకు కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం, నిర్మాణం ఇలా చాలా బాధ్యతల్ని బండి సరోజ్ కుమార్ నిర్వహించడం గమనార్హం. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రీలీజ్ కాగా ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇదిలా ఉంటే తన మనసుకు నచ్చిన పాత్రలే చేయాలనుకునే సరోజ్, గతంలో ఓ స్టార్ హీరో సినిమా ఛాన్స్ ను కూడా వదులుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాలో నటించేందుకు సరోజ్‌కు అవకాశం వచ్చింది. బుచ్చిబాబు స్వయంగా వచ్చి ఓ ముఖ్యమైన పాత్ర చేయాలని సరోజ్ ను అడిగారట. అయితే సరోజ్ మాత్రం ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. ఇందుకు సరోజ్ ఒక కారణం కూడా చెప్పాడు. తాను ఇతర హీరోల సినిమాల్లో సహాయక పాత్రలు చేయకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాడట. సొంతంగా సినిమాలు తీస్తూ హీరోగా ఎదగాలనేది తన ఆలోచన అని డైరెక్టర్ తో చెప్పారట. అలా పెద్ది సినిమాలో అవకాశం వచ్చినా సున్నితంగా రిజెక్ట్ చేశారట బీఎస్కే. అయితే పెద్ది సినిమాను రిజెక్ట్ చేసినా కూడా తన పరాక్రమం ఈవెంట్ కు ఏమి మనసులో పెట్టుకోకుండా బుచ్చిబాబు హాజరయ్యాడని సరోజ్ ప్రశంసలు కురిపించారు.

బండి సరోజ్ కుమార్ ఛప్రి సినిమా టీజర్..

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us