అన్నీ బరువైన ప్రశ్నలే. ఒక్కోటి ఆరడుగుల బుల్లెట్టంత. ఎప్పటినుంచో సగటు అభిమాని మనసును తొలిచేస్తున్న ఈ క్వశ్చన్ మార్కులన్నిటికీ ఒకేఒక ఫుల్‌స్టాప్.. అదీ ఏ ప్రెస్‌మీట్‌లోనో.. పబ్లిక్ మీటింగ్‌లోనో కాదు. ఆహా అన్‌స్టాపబుల్ స్టేజ్ మీద. బాప్ ఆఫ్ ఆల్ షోస్.. అన్‌స్టాపబుల్ సెకండ్ ఎడిషన్.. ఫైనల్ ఎపిసోడ్ నుంచి టీజర్ వచ్చేసింది. కామెడీలతో మొదలుపెట్టి.. వేడివేడి పొలిటికల్ పకోడీలతో ముగించినట్టున్నారు హోస్ట్ బాలయ్య. బాలయ్య వర్సెస్ పీఎస్‌పీకే.. ఫస్టాఫ్ తుస్సుమనకపోయినా.. ఓ మోస్తరుగా పేలింది. సెకండాఫ్ కోసం చేసిన వామప్‌లాగే ఉంది తప్ప అందులో చెప్పుకోదగ్గ పొలిటికల్ పటాసుల్లేవు. అందుకే.. మాంచి మసాలా దినుసులు దట్టించి.. దిట్టంగా తయారైనట్టుంది అన్‌స్టాపబుల్2 ఫినాలే సెకండ్ ఎపిసోడ్. టోటల్‌గా తెలుగు రాజకీయాల్నే రౌండప్ చేసింది బాలయ్య అండ్ పవన్ కాంబో. ఇప్పటంలో కారు మీదెక్కి రోడ్ షో చేసిన పవన్ ఫోటోతో మొదలు.. లాస్ట్ పంచ్ దాకా అదే టెంపర్.. అంతే టెంపో.
అన్నయ్య పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తన కళ్లముందే మూసుకుపోయినప్పుడు చెప్పుకోలేనంత పెయిన్ అనుభవించానని పవన్ గతంలో చెప్పుకున్నారు. తర్వాత సొంత పార్టీ పెట్టేలా ఆయన్ను డ్రైవ్ చేసిన సిట్యువేషన్స్ ఎటువంటివి.. వాటినే రాబట్టే ప్రయత్నం చేసినట్టున్నారు బాలయ్య. ప్రజారాజ్యం మునక.. జనసేన పుట్టుక ఈ రెండింటి గ్యాప్‌లో ఏం జరిగింది.. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరేలా పరిస్థితులు మారాయా..? బాలయ్య తీసుకొచ్చిన ఈ ప్రస్తావనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్ని కొత్తగా ఆలోచింపజేస్తోంది.
ప్రస్తుతం సినిమా-పాలిటిక్స్ జోడు గుర్రాల సవారీ చేస్తున్నారు పవన్. కానీ.. ఆ కష్టం ఇంకా ఎన్నాళ్లు… ఏదో ఒకరోజున ఆయన ఏదో ఒక జర్నీకే పరిమితం అవుతారా… అది సినిమాలా.. ప్రజా జీవితమా..? బిగ్ క్వశ్చన్. యాదృచ్ఛికం ఏంటంటే… ఇక్కడ హోస్ట్ అండ్ గెస్ట్ ఇద్దరి రాజకీయ శత్రువూ ఒక్కరే. వాళ్లిద్దరి మధ్య జరిగే సంభాషణ నుంచి ఎటువంటి ఫ్లేవర్లను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్న క్యూరియాసిటీ వల్లే ఈ ఎపిసోడ్ మీద ఆసక్తిని పెంచుతోంది. పవన్ పెళ్లిళ్ల మీద ఎవరు మాట్లాడినా ఊరకుక్కలతో సమానమంటూ ఫస్ట్ పార్ట్‌లో బాలయ్య ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పటికే కొన్ని సర్కిల్స్‌ని సూటిగా తాకేసింది. ఇలా… ఒకరి పొలిటికల్ యాంబిషన్స్‌ని మరొకరు ఎలివేట్ చేసేలా సెకండ్ పార్ట్‌ని కూడా సెంట్ పర్సెంట్ పొలిటికల్ స్టఫ్పుతో నింపేశారన్నవి కామెంట్లు.
కార్యకర్తలే బలం.. వారే మా సంపద అంటూ ఈనెల 10 నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదుకు రెడీ అవుతోంది జనసేన. దానికి బూస్ట్ ఇవ్వబోతోంది తాజా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్. టోటల్‌గా ఘాటైన ప్రశ్నలు.. సూటైన సమాధానాలు… వాటికి బాలయ్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్… ఆట అదరహో అనే సంకేతాలున్నాయి టీజర్‌లో. అందుకే… ఈనెల 10న ఆహాలో రాబోయే అణుగుండు ఎపిసోడ్ కోసం అందరూ వెయిటింగ్.