Akhanda Movie: జై బాలయ్య.. జై జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లిన థియేటర్.. అఖండ

బాలయ్య బోయపాటి కాంబో  గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. సింహ, లెజెండ్ సినిమాలతరవాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు.

Akhanda Movie: జై బాలయ్య.. జై జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లిన థియేటర్.. అఖండ
Akhanda

Edited By:

Updated on: Dec 02, 2021 | 11:28 AM

Akhanda Movie release: బాలయ్య బోయపాటి కాంబో  గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. సింహ, లెజెండ్ సినిమాలతరవాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. అఖండ గా బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. బాలయ్యను అభిమానులు ఎలా చూపించాలో బోయపాటికి బాగా తెలుసు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. బాలయ్య అఖండలో అఘోరా పాత్రలో కనిపించనున్నారు. నేడు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. ఈ సినిమా కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్‌లో తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోతో మొదలైంది.

అర్ధరాత్రి నుంచి బాలయ్య అభిమానులు భ్రమరాంభ థియేటర్ కు భారీగా చేరుకున్నారు. బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు. జై బాలయ్య అంటూ నినాదాలలో హోరెత్తించారు. థియేటర్ ప్రాంగణమంతా జై బాలయ్య .. జై జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లింది. మరో వైపు సీఎం బాలయ్య.. సీఎం బాలయ్య అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఇక ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. ఇప్పటికే నందమూరి తారక్ రత్న, నిర్మాత దిల్ రాజు, అఖండ నిర్మాత మిరియాల రవీంద్ర భ్రమరాంబ థియేటర్ కు చేరుకున్నారు. సినిమా చూసిన నటుడు సమీర్ మాట్లాడుతూ.. బాలయ్య మరో బ్లాక్ బస్టర్ కొట్టారని అన్నారు. హ్యాట్సాఫ్ బాలయ్య , బోయపాటి అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: షాకింగ్ ట్విస్ట్.. టాప్ 5లోకి ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఎవరెవరంటే..

Pushpa: పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బన్నీ ఫ్యాన్స్‏కు పండగే..

Comedian Raghu: సినిమా టు లిక్కర్‌ బిజినెస్‌.. మద్యం షాపులను దక్కించుకున్న కమెడియన్‌ రఘు..

Loading...
Unable to load recommendations.
Follow Us