Balagam Movie: ప్రభాస్‏తో నటించేందుకు సిద్ధమే.. బలగం మూవీ లచ్చవ్వ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Apr 05, 2023 | 8:26 AM

తెలంగాణ పల్లెల్లో కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపిస్తూ.. ఆడియన్స్ హృదయాలను హత్తుకునేలా చేస్తుంది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ తమ తమ పాత్రలలో జీవించేశారు

Balagam Movie: ప్రభాస్‏తో నటించేందుకు సిద్ధమే.. బలగం మూవీ లచ్చవ్వ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rupa Lakshmi
Follow us on

చానాళ్ల తర్వాత ప్రేక్షకుల మనసులను తాకిన సినిమా బలగం. బంధాలు.. బంధుత్వాల విలువ తెలియజేస్తూ కమెడియన్ వేణు యెల్దండి.. దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ముఖ్యంగా పల్లెల్లో బలగం సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ సినిమా మాటే వినిపిస్తోంది. ప్రియదర్శి. కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమాకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుంది. తెలంగాణ పల్లెల్లో కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపిస్తూ.. ఆడియన్స్ హృదయాలను హత్తుకునేలా చేస్తుంది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ తమ తమ పాత్రలలో జీవించేశారు. ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు.

ఈ చిత్రంలో హీరోకు అత్తమ్మగా.. హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె… తన పాత్రకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. తన కుటుంబం గురించి గురించి చెప్పుకొచ్చారు. 70 ఏళ్ల వ్యక్తికి అమ్మగా నటించాలని అడిగినా తనకెలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అలాగే ప్రభాస్ కు తల్లి పాత్రలో నటించడానికి కూడా సిద్ధమే అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

“మా నాన్న రైతు.. ఆయనకు ఆరుగురు సంతానం. నన్ను ఓ లెక్చరర్ కుటుంబానికి దత్తత ఇచ్చారు. ఇప్పటికీ నేను నా కుటుంబసభ్యులతో కలిసే ఉంటాను” అని అన్నారు. మీరు తక్కువ వయసులోనే తల్లి పాత్రను పోషించారు. అలాగే రేపు ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు తల్లి పాత్రలు చేయమని అడిగితే ఏం చేస్తారని ప్రశ్నించగా.. రూపలక్ష్మి స్పందిస్తూ.. ” ఒక మహిళగా సంతృప్తినిచ్చే స్థానం అమ్మ. కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నటించడానికి ఎప్పుడు సిద్ధమే.. ఇందులో నాకేలాంటి అభ్యంతరం లేదు.. 70 ఏళ్ల వ్యక్తికి అమ్మగా నటించాలని అడిగినా నాకేలాంటి ఇబ్బందిలేదు. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించడానికి నేనేప్పుడు సిద్ధమే” అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.