Satya Yamini: బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌ బై చెప్పనున్న బాహుబలి సింగర్‌.. కాబోయే భర్తను పరిచయం చేసిన సత్య యామిని

|

Dec 04, 2022 | 3:24 PM

బాహుబలి సిరీస్‌ తర్వాత శైలజారెడ్డి అల్లుడు, మిస్టర్‌ మజ్ఞు, ప్రేమకథాచిత్రమ్‌ 2, వెంకీమామ, ప్రతిరోజు పండగే, అల వైకుంఠపురంలో, వి, వైల్డ్‌డాగ్, వరుడు కావలెను, ఎనిమి, అఖండ, వకీల్‌సాబ్‌, కొండపొలం, రాధేశ్యామ్‌,బింబిసార, అహింస, అఖండ సినిమాల్లో సత్య పాడిన పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి.

Satya Yamini: బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌ బై చెప్పనున్న బాహుబలి సింగర్‌.. కాబోయే భర్తను పరిచయం చేసిన సత్య యామిని
Satya Yamini
Follow us on

ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలోని మమతల తల్లి పాట ఎంతో పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన మధురమైన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోసింది హైదరాబాద్‌కు చెందిన సత్య యామిని. బాహుబలి సిరీస్‌ తర్వాత శైలజారెడ్డి అల్లుడు, మిస్టర్‌ మజ్ఞు, ప్రేమకథాచిత్రమ్‌ 2, వెంకీమామ, ప్రతిరోజు పండగే, అల వైకుంఠపురంలో, వి, వైల్డ్‌డాగ్, వరుడు కావలెను, ఎనిమి, అఖండ, వకీల్‌సాబ్‌, కొండపొలం, రాధేశ్యామ్‌,బింబిసార, అహింస, అఖండ సినిమాల్లో సత్య పాడిన పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇక అఖండ సినిమాలో యామిని ఆలపించిన జై బాలయ్య సాంగ్‌ టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఇలా హిట్ పాటలతో ప్లే బ్యాక్‌ సింగర్‌గా దూసుకెళుతోన్న సత్య తన వ్యక్తిగత విషయానికి సంబంధించి ఒక శుభవార్తను పంచుకుంది. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోనూ షేర్‌ చేస్తూ ‘జీవితకాలానికి సంబంధించిన రోలర్‌ కోస్టర్‌ వేచి ఉంది’ అని రాసుకొచ్చింది.

ప్రస్తుతం సత్య పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గీతామాధురి, అనుదీప్‌, మనీషా, పూజాతోపాటు పలువురు సెలబ్రిటీ సింగర్లు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు. క్యూట్‌ కపుల్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే, తనకు కాబోయే వాడి ఫొటోను షేర్‌ చేసిన యామిని అతనికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..