Prabhas: మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్.. దర్శకుడు ఎవరో తెలుసా..?

పాన్ ఇండియా స్టార్ క్రేజ్ రావడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఆఘనతను మన డార్లింగ్ దక్కించుకున్నాడు. ఒక్క బాహుబలి సినిమాతో ఏకంగా ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు

Prabhas: మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్.. దర్శకుడు ఎవరో తెలుసా..?
Prabhas
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 29, 2021 | 8:11 AM

Prabhas: పాన్ ఇండియా స్టార్ క్రేజ్ రావడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఆఘనతను మన డార్లింగ్ దక్కించుకున్నాడు. ఒక్క బాహుబలి సినిమాతో ఏకంగా ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయనతో సినిమా చేయాలనీ టాలీవుడ్ దర్శకులు మాత్రమే కాదు బాలీవుడ్ డైరెక్టర్స్  కూడా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో వరుసగా భారీ సినిమాలను లైన్‌లో పెట్టేశాడు ప్రభాస్. ఏమాత్రం గ్యాప్ లేకుండా అన్ని సినిమాలను అనుకున్న టైంకు కంప్లీట్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజ ప్రభాస్‌తో రొమాన్స్ చేయనుంది. అలాగే ఈ సినిమా తర్వాత వెంటనే సలార్ సెట్‌లో అడుగు పెట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులకు గుజ్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమాతోపాటుగా ఆదిపురుష్ సినిమాను కూడా కానిచేస్తున్నాడు ఈ మిర్చిలాంటి కుర్రాడు.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడన్నది టాక్. ఇక ఈ మూవీలో లంకేశ్‌గా బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. సీతగా కృతిసనన్ కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చకచకా జరుగుతుంది. వీటితోపాటు అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న నాగ్ అశ్విన్ సినిమాకూడా మొదలు పెట్టేశాడు ప్రభాస్. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా చిత్రానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడట. తాజాగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ హీరో ప్రభాస్ ను కలసి కథ చెప్పాడనీ, అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna Akkineni: కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ.. మీరు ఒక లుక్ వేయండి..

Maestro: మాస్ట్రో అఫీషియల్ డేట్ వచ్చేసింది.. హాట్‌స్టార్‌ ప్రకటించింది.. ఎప్పుడో తెలుసా.!

PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్‌ చేసిన చిరంజీవి

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో