
సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి ఆరుగురు పతివ్రతలు. అప్పటిలో ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పలు వివాదల్లోనూ ఈ సినిమా చిక్కుకుంది. ఈ సినిమా వచ్చి చాలా కాలం అయినప్పటికీ జనాలు ఈ సినిమా గుర్తించే మాట్లాడుకుంటున్నారు. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కామెడీ సినిమాలతో , ఫ్యామిలీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈవీవీ తన రూట్ మార్చి ఇలా రోమాంటిక్ సినిమాతో అందరికి షాక్ ఇచ్చారు. 2004లో తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో చాలా మంది కొత్త ఆర్టిస్ట్ లు నటించారు. ఈ సినిమాలో మొత్తంగా నలభై రెండు మంది కొత్తవారు నటించారు. చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కమలాకర్ సంగీతాన్ని అందించారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఆరుగురు పతివ్రతలు సినిమా కూడా రీ రిలీజ్ చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సీన్లను మీమర్స్ తెగ వాడుతుంటారు. ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ చేయాలని ఇప్పటికే చాలా మంది పెద్ద ఎత్తు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆరుగురు పతివ్రతలు సినిమాలు రిలీజ్ అయ్యి 22 సంవత్సరాలు అవుతుంది. దాంతో ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఆరుగురు పతివ్రతలు సినిమాను 4K వెర్షన్ రీ రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు మెరుగైన ఆడియో క్వాలిటీ, 4కే వర్షన్ లాంటి మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే ఆరుగురు పతివ్రతలు సినిమాలో నటించిన నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు నెటిజన్స్. ఆరుగురు పతివ్రతలుతో ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది హీరోయిన్ అమృత. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈ బ్యూటీని తెలుగు తెరకు పరిచయం చేశారు ఈవీవీ. ఈ సినిమా తర్వాత తెలుగులో కేవలం ఎనిమిది చిత్రాల్లోనే నటించింది. 2009లో ‘జోడి నెంబర్ 1’ సినిమాలో నటించింది ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండదు ఈ హీరోయిన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి