AR Rehaman: యాంకర్ పై సంచలన కామెంట్లు చేసిన మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్..

|

Mar 26, 2021 | 9:08 PM

AR Rehaman 99 Songs Movie: మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం '99సాంగ్స్'. ఇందులో ఇహాన్ భట్, ఎడిల్సీ హీరోహీరోయిన్లుగా

AR Rehaman: యాంకర్ పై సంచలన కామెంట్లు చేసిన మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్..
Ar Rehaman
Follow us on

AR Rehaman 99 Songs Movie: మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ’99సాంగ్స్’. ఇందులో ఇహాన్ భట్, ఎడిల్సీ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళ, హిందీ బాషలలో ఏప్రిల్ 16న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ మూవీ ఆడియో లాంచ్ గురువారం చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హిందీలో మాట్లాడిన యాంకర్ పై ఏఆర్ రెహమాన్ ట్రోల్ చేశారు.

ఈ సినిమాలో నటిస్తున్న ఇహాన్ భట్‏ను వేదికపైకి స్వాగతం పలికే సమయంలో యాంకర్ హిందీలో మాట్లాడింది. దీంతో పక్కనే ఉన్న రెహమాన్ నువ్వు హిందీలో మాట్లాడుతున్నావా అంటూ స్టేజీపైనే అనేశారు. ఆ తర్వాత నవ్వుతూ.. నేను సరదాగానే అన్నాను అంటూ చెప్పుకోచ్చారు. ఇక ఆ విషయాన్ని యాంకర్‏తోపాటు అక్కడున్న వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో ఆ విషయం పెద్దదిగా కాలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తమిళ ప్రజలు హిందీని అసహ్యించుకుంటారన్న సంగతి తెలిసిందే. అక్కడ ఎవరు మాట్లాడరు. అలాగే అక్కడ ఉండే షాప్ బోర్డ్స్ కానీ, రహాదారి పేర్లు కానీ.. కేవలం తమిళ్, ఇంగ్లీష్ భాషలలో మాత్రమే దర్శనమిస్తాయి. ఇక చెన్నైలో యాంకర్‌ హిందీలో మాట్లాడంతో ఎక్కడ కాంట్రవర్సీ అవుతందోనని ముందే గ్రహించిన రెహమాన్‌ వివాదాలకు దూరంగా ఉండటానికి హిందీలో మాట్లాడిన యాంకర్‌ను ఫన్నీగా ట్రోల్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read:

Upasana Konidela: రామరాజు పోస్టర్ పై స్పందించిన రామ్ చరణ్ సతీమణి.. శ్రీవారిని శ్రీరాముడితో పోలుస్తూ..

అబ్బాయిగా మారేందుకు ట్రైచేసిన మిల్కీ బ్యూటీ.. కానీ… అట్టర్ ప్లాప్ అయ్యిందే.. నవ్వులు పూయిస్తున్న వీడియో…