ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు నిర్దారిస్తూ జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్లు.. నాలుగు కేటగిరీలుగా విభజించింది. అందులో కనీసం 20,గరిష్టంగా 250 గా రేట్ల నిర్దారించింది. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ కేటగిరీలుగా థియేటర్ల టికెట్స్ రేట్స్ ఫిక్స్ చేసింది.
ఒక్కో థియేటర్ లో కేవలం రెండే రకాల టిక్కెట్లు ఉండగా.. ప్రీమియం,నాన్ ప్రీమియంగా రేట్ల నిర్దారణ జరిగింది. అంటే.. ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా సినిమా టికెట్స్ రేట్లపై టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ ప్రముఖులు.. డిస్టిబ్యూటర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై క్లారిటీ రాకముందే కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అఖండ, పుష్ప, బంగార్రాజు లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తగ్గించిన టికెట్ రేట్ల మధ్యే విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి, రాజమౌళి, మహేష్, ప్రభాస్, నారాయణమూర్తి, కొరటాల శివలు సీఎం జగన్‌ను కలిశారు. టిక్కెట్ల ధరల విషయంలో మరో నిర్ణయం తీసుకోవాలని కోరారు. భేటీ అనంతరం గుడ్ న్యూస్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మెగాస్టార్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయంలో జీవో జారీ కావడంతో సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. హీరో ప్రభాస్ మూవీని ప్రమోట్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. జీవో జారీ తరువాయితో ట్రిపులార్, ఆచార్య టీమ్స్ కూడా ప్రచార కార్యక్రమాలను స్పీడప్ చేయాలని భావిస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డాయి.
Also Read: Akhil Agent: అఖిల్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ సర్ప్రైజ్..
సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..
Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..
Nithiin: నితిన్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో స్పెషల్ సాంగ్ ?..