Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇంట విషాదం.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

సినీ  నటుడు ప్రకాష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ తల్లి శ్రీమతి సువర్ణలత  కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం బెంగుళూరులో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆమె వయోభారం సమస్యలతో బాధపడుతున్నారు .

Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇంట విషాదం.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్
Prakash Raj

Updated on: Mar 30, 2026 | 1:10 PM

సినీ  నటుడు ప్రకాష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ తల్లి శ్రీమతి సువర్ణలత  కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం బెంగుళూరులో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆమె వయోభారం సమస్యలతో బాధపడుతున్నారు. నేటి ఉదయం బెంగుళూరులోని స్వగృహంలో సువర్ణలత   కన్నుమూశారని తెలుస్తుంది. దాంతో ప్రకాష్ రాజ్ ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

శ్రీదేవితోనే ప్రాబ్లమ్ .. ఆమె ఉంటే సినిమా చేయనున్న హీరోయిన్.. కానీ చివరకు

ప్రకాష్ రాజ్ తల్లి మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ స్పీకర్ , హీరో పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ తల్లి మరణానికి సంతాపం తెలిపారు. ప్రముఖ నటుడు శ్రీ ప్రకాష్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సువర్ణలత గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ పవన్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి కారణం నేనే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

చైనాలో వందరోజులు ఆడిన తొలి తెలుగు సినిమా.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us