శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం

ప్రముఖ గాయని అనురాధ శ్రీరామ్ తన సంగీత ప్రయాణంతో పాటు ఆధ్యాత్మిక అనుభవాలను కూడా పంచుకున్నారు. చిన్నతనం నుంచే సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలిగా పెరిగిన ఆమె.. రమణ మహర్షిని తన మానసిక గురువుగా భావిస్తారు. రమణ మహర్షి నుంచి శరణాగతి తత్వాన్ని నేర్చుకున్నానని చెబుతారు. ‘మనమేమీ కాదు.. దేవుడే అన్నీ’ అనే భావన తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిందని తెలిపారు. మన జీవితంలోని బాధలు, భయాలు, కోపాలను భగవంతుడికి అప్పగిస్తే ప్రశాంతంగా జీవించవచ్చని ఆమె చెప్పారు.

శరణాగతి తత్వాన్ని రమణ మహర్షి దగ్గర నేర్చుకున్నా.. అనురాధ శ్రీరామ్ ఆధ్యాత్మిక అనుభవం
Anuradha Sriram Ramana Maharshi

Updated on: Aug 20, 2026 | 1:32 PM

ప్రముఖ గాయని అనురాధ శ్రీరామ్ తన సంగీత ప్రయాణంతో పాటు ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చిన్నతనం నుంచే సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలిగా పెరిగిన ఆమె.. తన జీవితంలో రమణ మహర్షి ప్రభావం ఎంతో ఉందని చెబుతారు. చిన్నతనంలో తన తండ్రి మోహన్ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) భక్తుడిగా ఉండేవారని అనురాధ శ్రీరామ్ గుర్తుచేసుకున్నారు. చెన్నైలోని కేకే నగర్‌లో ఉన్న సమయంలో తండ్రి ప్రతి వారం కుటుంబ సభ్యులను వడపళని మురుగన్ ఆలయానికి తీసుకెళ్లేవారట. చిన్నప్పటి నుంచే కంద షష్టి కవచం వింటూ పెరిగానని, మురుగన్ తనకు ఎప్పటికీ ప్రత్యేకమైన దేవుడని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

తన సినీ సంగీత ప్రయాణం కూడా మురుగన్ అనుగ్రహమేనని అనురాధ శ్రీరామ్ భావిస్తారు. సుమారు 25 ఏళ్లలో 5 వేల వరకు సినిమాల్లో పాటలు పాడానని, తన గొంతు బాగుందని అభిమానులు ప్రశంసించినప్పుడు కూడా దాన్ని మురుగన్ కృపగానే భావిస్తానని తెలిపారు. తన సంగీత, జీవిత ప్రయాణాల్లో మురుగుడే అండగా నిలిచారని పేర్కొన్నారు.

అయితే రమణ మహర్షిని తన మానసిక గురువుగా భావిస్తానని అనురాధ శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రమణ మహర్షిని మురుగన్ మరో రూపంగా ఆయన శిష్యులు భావిస్తారని అన్నారు. తాను నెలకు ఒకసారైనా రమణాశ్రమానికి వెళ్తానని తెలిపారు. ‘మనమేమీ కాదు.. దేవుడే అన్నీ’ అనే భావనను రమణ మహర్షి నుంచి నేర్చుకున్నానని ఆమె చెప్పారు. మనం చేసే ప్రతి పనినీ భగవంతుడే చేయిస్తున్నాడని భావిస్తే కోపం, బాధ, భయం వంటి భావాలు తగ్గిపోతాయని అన్నారు.

ఇవి కూడా చదవండి

భగవద్గీతలో కృష్ణుడు పార్థసారథిగా ఉండటం కూడా ఇదే తత్వాన్ని సూచిస్తుందని ఆమె వివరించారు. రథంలోని ఐదు గుర్రాలు మన ఐదు ఇంద్రియాలకు ప్రతీకలని, వాటిని నియంత్రించే బాధ్యతను భగవంతుడికి అప్పగించాలన్నారు. ‘అన్నింటిలోనూ భగవంతుడిని చూడాలి’ అనే రమణ మహర్షి బోధనే తన జీవితానికి మార్గదర్శకమని అనురాధ శ్రీరామ్ తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us