Anupama Instapost Post Viral: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, సంజన గణేషన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పేసర్ గోవాలో పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నటి అనుపమ పరమేశ్వరన్.. బుమ్రాతో ప్రేమాయణంలో ఉందని గతంలో వార్తలు షికార్లు చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ గతంలో అనుమప తన అభిమాన క్రికెట్ బుమ్రా అంటూ వ్యాఖ్యలు చేయడం, బుమ్రా స్వస్థలం గుజరాత్‌ను సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వదంతులు మరింత ఎక్కువయ్యాయి.
అయితే తాజాగా వివాహం చేసుకున్న తర్వాత అనుపమ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేస్తోన్న కొన్ని పోస్ట్‌లు నిజంగానే వీరిద్దరి మధ్య ఏదైనా ఉందా.? అన్న ప్రశ్నలకు బలం చేకూరుస్తున్నాయి. ఇంతకీ అనుపమ చేసిన పోస్ట్‌లు ఏంటనేగా.. రెండు రోజుల క్రితం అనుపమ మలయాళం భాషకు సంబంధించిన ఓ విషాదకర పాటను ఆలపించిన వీడియోను పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఇన్‌స్టా స్టోరీలో.. ‘నా నుంచి దూరంగా ఉండు. ఎందుకంటే ముక్కలైపోయిన నా గుండె నీకు గుచ్చుకొని నొప్పి పెట్టవచ్చు. అయినా గాయం నయం కావోచ్చేమో గానీ వాటి తాలూకూ మచ్చలు అలాగే ఉండిపోతాయి’ అంటూ ఓ పోస్ట్ చేసింది. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనే ‘డిప్రెషన్’కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది అను. దీంతో అనుపమ బుమ్రాను ఉద్దేశించే ఈ పోస్టులు చేస్తోందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళుతుందో కాలమే సమాధానం చెప్పాలి.
Also Read: