
ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మనసులు దొచుకుంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఫస్ట్ మూవీతోనే… లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ. ఇందులో అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా కనిపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తక్కవగా సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటివరకు అనుపమ చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుపమ.
తాజాగా అనుపమ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు (ఫిబ్రవరి 18న) అనుపమ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్‌తోపాటు.. అనుపమ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు బటర్ ఫ్లై (సీతాకోక చిలుక) అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనుపమ లుక్స్ ఆకట్టుంటున్నాయి. జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై గంటా సతీష్ బాబు దర్శకత్వంలో రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమోల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అరవింద్ షారోన్, గిడోన్ కట్టా సంగీతం అందిస్తున్నారు.
Also Read: Kalaavathi Song: సూపర్బ్.. అదిరిపోయిన కళావతి సాంగ్ మేకింగ్ వీడియో.. నెట్టింట్లో ట్రెండింగ్..
Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‌కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..
Viral Video: ద్యావుడా.. ఇదెక్కడి టెస్ట్ రా బాబు.. టెస్టీ ఫుడ్‌ను ఎలా చేశారో చూడండి..