Animal: యానిమల్ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డీల్ సెట్

‘అర్జున్‌రెడ్డి’ సినిమా ద్వారా సందీప్‌రెడ్డి వంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే చిత్రాన్ని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు. దానికి దర్శకత్వం కూడా ఆయనే వహించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమా చేస్తున్నారు సందీప్. రష్మిక మందన్న, రణబీర్ కపూర్, బాబీ డియోల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘యానిమల్’.

Animal: యానిమల్ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డీల్ సెట్
Animal

Updated on: Nov 23, 2023 | 10:12 AM

బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఏది అంటే యానిమల్ అనే చెప్పాలి. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ  అంచనాలు క్రియేట్ అయ్యాయి. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా ద్వారా సందీప్‌రెడ్డి వంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశారు. దానికి దర్శకత్వం కూడా ఆయనే వహించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమా చేస్తున్నారు సందీప్. రష్మిక మందన్న, రణబీర్ కపూర్, బాబీ డియోల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘యానిమల్’. ఈ సినిమా కూడా ‘అర్జున్‌రెడ్డి’ షేడ్‌లోనే ఉండనుంది. ఇప్పటికే యానిమల్ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది . అందుకే సినిమాను పెద్దగా ప్రమోట్ చేయడం లేదు టీమ్.

తెలుగులోనూ ఈ సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ పాన్ ఇండియా మూవీ.. తెలుగు,  హిందీ భాషల్లో ఈ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డీల్ లాక్ అయ్యిపోయింది.

యానిమల్ ట్రైలర్ ఈ రోజు విడుదల కానుంది. అలాగే యానిమల్ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ యానిమల్ డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని తెలుస్తోంది. అలాగే యానిమల్ హిందీ రైట్స్ ను సోనీ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది. తాజాగా యానిమల్ కు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు మెంబర్స్. మరి సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us