Sreemukhi: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న శ్రీముఖి పెళ్లి ఫొటోలు

| Edited By:

Feb 17, 2020 | 9:49 PM

యాంకర్ శ్రీ ముఖికి పెళ్లి ఫిక్స్ అయ్యిందా? త్వరలోనే ఈ అమ్మడు అత్తారింట్లో అడుగు పెట్టనుందా? తాజాగా.. శ్రీముఖి ఇంట్లో పెళ్లిభాజాలు మోగాయి. ఆ హడావిడి అంతా చూస్తే నిజంగానే ఆమెకు పెళ్లి జరుగుతోందని అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఎనర్జిటిక్‌కి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే అందులో శ్రీముఖీ కూడా ఉంటుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది. టాలీవుడ్‌‌లో ఉన్న ప్రముఖ యాంకర్లలో శ్రీముఖి కూడా ఉంటుంది. కేవలం బుల్లితెరపైనే కాకుండా […]

Sreemukhi: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న శ్రీముఖి పెళ్లి ఫొటోలు
Follow us on

యాంకర్ శ్రీ ముఖికి పెళ్లి ఫిక్స్ అయ్యిందా? త్వరలోనే ఈ అమ్మడు అత్తారింట్లో అడుగు పెట్టనుందా? తాజాగా.. శ్రీముఖి ఇంట్లో పెళ్లిభాజాలు మోగాయి. ఆ హడావిడి అంతా చూస్తే నిజంగానే ఆమెకు పెళ్లి జరుగుతోందని అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు.

ఎనర్జిటిక్‌కి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే అందులో శ్రీముఖీ కూడా ఉంటుంది. ఎప్పుడూ తను ఎనర్జిటిక్‌గా ఉంటూ.. షోలో ఉన్న వారందరినీ ఉత్సాహపరుస్తుంది. టాలీవుడ్‌‌లో ఉన్న ప్రముఖ యాంకర్లలో శ్రీముఖి కూడా ఉంటుంది. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా కనువిందు చేసింది. ఇక ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్-3లో కూడా చివరివరకూ కొనసాగుతూ.. టైటిల్ విన్నర్ అవుతుందని అందరూ ఆశించినా.. అందుకు భిన్నంగా.. రన్నరప్‌గా మాత్రమే నిలిచింది.

ఇక బిగ్‌బాస్ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్నా.. వెంటనే స్టార్‌ మా ఛానెల్‌లోని ‘స్టార్ మ్యూజిక్‌’ షోతో కనువిందు చేస్తోంది. తాజాగా.. శ్రీముఖి ఇంట పెళ్లిభాజాలు మోగాయి. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవడంతో.. అందరూ శ్రీముఖికి పెళ్లి అవుతుందేమో అనుకుంటున్నారు. ఆమె ఇంట్లో పెళ్లి భాజాలు మోగిన మాట నిజమే కానీ… అది తనది కాదు.. వాళ్ల చెల్లిది. అయినా శ్రీముఖి పెళ్లి ఫిక్స్‌ అయితే.. ఇంత సైలెంట్‌గా ఎందుకు ఉంటుందని.. ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.