సొంత ఇల్లు కూడా లేదు.. వచ్చిన డబ్బులన్నీ దానికే ఖర్చు చేశా.. సౌమ్య రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

జబర్దస్త్ ద్వారా చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్న విషయం తెలిసిందే. చాలా మంది కమెడియన్స్‌గా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. కొంతమంది హీరోలుగా మరికొంతమంది దర్శకులుగా రాణిస్తున్నారు. వీరితో పాటు యాంకర్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనసూయ యాంకర్ నుంచి ఇప్పుడు యాక్టర్ గా మారారు.

సొంత ఇల్లు కూడా లేదు.. వచ్చిన డబ్బులన్నీ దానికే ఖర్చు చేశా.. సౌమ్య రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Soumya Rao

Updated on: Jan 15, 2026 | 8:53 AM

జబర్దస్త్ ద్వారా కేవలం నటులు మాత్రమే కాదు యాంకర్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి వారు మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కామెడీ షో ద్వారానే.. అలాగే ఆ మధ్య జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారింది ఓ ముద్దగుమ్మ ఆమె సౌమ్య రావు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సౌమ్య రావు. ఇక జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా చేసింది కొన్ని రోజులే కానీ తన మాటలతో , చలాకీ తనంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు టీవీ షోల్లో పాల్గొంది. అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలను పంచుకుంది .

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన యూట్యూబ్ రెవెన్యూ, నెలవారీ ఖర్చులు,  లైఫ్ స్టైల్ , ప్రేమ జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు. ముందుగా, తన సోషల్ మీడియా వాడకం గురించి మాట్లాడుతూ..ఇన్‌స్టాగ్రామ్‌లో తాను మంచి మేకప్ వేసుకున్నా, మంచి డ్రెస్ వేసుకున్నా అవుట్‌ఫిట్ చూపించడానికి మాత్రమే పెడతానని, కానీ కొంతమంది తినే ఫుడ్ నుంచి ఇంట్లోకి వచ్చిన కాక్రోచ్ వరకు మొత్తం షేర్ చేస్తుంటారు అని తెలిపింది. అలాగే  తన యూట్యూబ్ ఛానెల్ గురించి మాట్లాడుతూ..

గతంలో డబ్బులు బాగానే వచ్చాయని, కానీ ప్రస్తుతం ఛానెల్ యాక్టివ్‌గా లేనందున ఎలాంటి రెవెన్యూ రావడం లేదని తెలిపింది. తన నెలవారీ ఖర్చుల గురించి చెప్తూ.. తాను 5 వేలు, 10 వేల రూపాయలతో కూడా బ్రతకడం తెలుసని చెప్పుకొచ్చింది. ఒక సాధారణ ఆర్టిస్ట్‌కు నెలకు 30-40 వేల రూపాయలుంటే సరిపోతుందని, తాను కూడా అంతే ఖర్చు చేస్తానని ఆమె తేల్చి చెప్పింది. ఖరీదైన పార్లర్‌ల వైపు తాను వెళ్ళనని, తమది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ కుటుంబమని తెలిపింది. తాను ప్రస్తుతం ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నానని, సొంత ఇల్లు కూడా లేదని స్పష్టం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నా సొంత ఇల్లు ఎందుకు తీసుకోలేకపోయారు అని అడగ్గా, జబర్దస్త్ కు ముందు సీరియల్స్ చేసినప్పుడు వచ్చిన డబ్బులన్నీ తన కాస్ట్యూమ్స్, నెలవారీ ఖర్చులకే సరిపోయేవని, పెద్దగా సేవింగ్స్ లేవని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.