
యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి మంచి క్రేజ్ తెచ్చుకుంది శివ జ్యోతి. బిగ్ బాస్ హౌస్‌లోనూ సందడి చేసింది శివ జ్యోతి. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆమె పలు టీవీ షోల్లో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ రకరకాల వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది. అలాగే కొన్ని వివాదాల్లోనూ చిక్కుకుంది ఆమె.. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది శివజ్యోతి. తిరుమల ప్రసాదం పై శివ జ్యోతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. శివజ్యోతి పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా క్యూ లైన్‌లో నిలబడి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ కామెంట్స్ చేసింది శివజ్యోతి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో శ్రీవారి భక్తులు శివ జ్యోతి పై ఫైర్ అవుతున్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అవమానించారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ హిందూ సంఘాలు శివ జ్యోతి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి భక్తులు, నెటిజన్స్ ఫైర్ అవ్వడంతో శివజ్యోతి క్షమాపణలు చెప్పింది. ఈమేరకు ఆమె ఓ వీడియో షేర్ చేసింది.
పొద్దున్నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో.. నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. వివరణ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరనా హర్ట్ అయి ఉంటే, నేను సారీ చెప్తున్నాను.. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు తెలుసు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో.. నా యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో గత మూడు నాలుగు నెలలుగా శనివారాల్లో చేసే వ్రతాల గురించి డీటెయిల్స్ చెబుతూనే ఉన్నా. వాటి గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. ఏదైనా సరే నా సైడ్ నుంచి తప్పు జరిగింది కాబట్టి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే, నా ఇంటెన్షన్ మాత్రం అది కాదు. ‘మేము రిచ్’ అని అన్నది.. పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు, రూ.10000 ఎల్1 క్యూ లైన్‌లో నిలబడ్డప్పుడు. కాస్ట్లీ లైన్ లో నిలబడ్డామనే ఉద్దేశంతో అన్నాను.. మరో ఉద్దేశంతో కాదు. నా సైడ్ నుంచి తప్పైతే జరిగింది. నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. మా ఇద్దరి తరపున అందరికీ సారీ చెప్తున్నా.. నా ఇంట్లో వేంకటేశ్వరస్వామి ఉన్నారు. అలాగే నా చేతి మీద కూడా ఉన్నారు. అలాగే నా జీవితంలో అత్యంత విలువైన నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతాను. అసలు ఆయన గురించి తప్పుగా మాట్లాడను.. అయినా సరే నావల్ల తప్పు జరిగింది నన్ను క్షమించండి అని వీడియో రిలీజ్ చేసింది శివ జ్యోతి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి