AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: నమ్మొద్దు.. పుష్ప 2 విషయంలో అవన్నీ అబద్ధాలే.. ఫుల్ క్లారిటీ ఇదిగో

పుష్ప సీక్వెల్‌తోనే అల్లు వారి సొంత స్టూడియో ఓపెన్ కానుందా..? అసలు దీని లాంఛింగ్ ఎప్పుడు..?

Pushpa 2: నమ్మొద్దు.. పుష్ప 2 విషయంలో అవన్నీ అబద్ధాలే.. ఫుల్ క్లారిటీ ఇదిగో
Pushpa Movie
Ram Naramaneni
|

Updated on: Sep 23, 2022 | 8:19 PM

Share

Tollywood: సెట్స్‌పైకి వెళ్లకుండానే ఎన్నో విషయాల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోతుంది పుష్ప 2. పైగా దీనిపై సోషల్ మీడియాలో చాలా గాసిప్స్ వస్తున్నాయి. అందులో ఓ క్రేజీ న్యూస్.. అల్లు స్టూడియోలో షూటింగ్ చేసుకోబోయే మొదటి సినిమా పుష్ప 2 అని రావడం. మరి ఇందులో నిజమెంత..? పుష్ప సీక్వెల్‌తోనే అల్లు వారి సొంత స్టూడియో ఓపెన్ కానుందా..? అసలు దీని లాంఛింగ్ ఎప్పుడు..? అల్లు అర్జున్(Allu Arjun) ఎప్పుడెప్పుడు పుష్ప 2 షూటింగ్ మొదలు పెడతారా అని అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసారు. దసరా తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఆర్నెళ్లలోనే టాకీ పూర్తి చేయాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు. దీనికోసం పర్ఫెక్టుగా షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే అల్లు స్టూడియోస్‌లో పుష్ప 2 షూటింగ్ మొదలు కానుందని ప్రచారం జరుగుతుంది.

ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, నిర్మాతలకు సొంత స్టూడియోలున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ ఔట్ స్కర్ట్స్‌లో అల్లూ స్టూడియోస్ భారీ స్థాయిలో నిర్మించారు. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ స్టూడియో ఓపెనింగ్ జరగనుంది. అయితే అందులోనే పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని వస్తున్న ప్రచారం మాత్రం పూర్తిగా అబద్ధం. ఆ రోజు రామలింగయ్య జయంతి కారణంగా.. లాంఛ్ చేస్తున్నాం కానీ షూటింగ్స్ ఏం లేవని తేల్చేసారు అల్లూ స్టూడియోస్ అధినేతలు. ఫిల్మ్‌ మేకింగ్‌కు అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీతో 10 ఎకరాలకు పైగానే ఈ స్టూడియో ఉండబోతుందని తెలుస్తుంది. సినిమా రంగానికి అల్లు రామలింగయ్య చేసిన సేవలకు కొనసాగింపుగా గండిపేట ప్రాంతంలో స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ ఫిల్మ్‌ స్టూడియోను నిర్మిస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు అల్లు కుటుంబం. ఈ స్టూడియో ఓపెనింగ్‌కు ప్రత్యేక అతిథి రానున్నారని తెలుస్తుంది. మొత్తానికి అక్టోబర్ 1న ఓపెనింగ్ వరకు నిజమే కానీ.. అందులో పుష్ప 2 షూటింగ్ మాత్రం అబద్ధమని తేలిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శ్రావణ సోమవారం వ్రతం మహిమ తెలుసా? శివారాధనతో కలిగే శుభఫలితాలు ఇవే
శ్రావణ సోమవారం వ్రతం మహిమ తెలుసా? శివారాధనతో కలిగే శుభఫలితాలు ఇవే
కేబీఆర్ పార్క్ వైపు వెళుతున్నారా..? ట్రాఫిక్ పోలీసులు బిగ్ అర్ట్.
కేబీఆర్ పార్క్ వైపు వెళుతున్నారా..? ట్రాఫిక్ పోలీసులు బిగ్ అర్ట్.
తీరు మార్చుకోని NTA.. UGC NET 2026 పరీక్ష రద్దు! ఏం జరిగిందంటే..
తీరు మార్చుకోని NTA.. UGC NET 2026 పరీక్ష రద్దు! ఏం జరిగిందంటే..
డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు.
డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు.
ఉత్తమ సోలార్‌ ప్యానెల్‌ ఏది..? ఏది అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి?
ఉత్తమ సోలార్‌ ప్యానెల్‌ ఏది..? ఏది అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి?
శ్రావణ మాసం స్పెషల్.. బాదం సేమియా..కమ్మ కమ్మగా ఎలా చేయాలంటే?
శ్రావణ మాసం స్పెషల్.. బాదం సేమియా..కమ్మ కమ్మగా ఎలా చేయాలంటే?
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి షెడ్యూల్డ్ విమానం..
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి షెడ్యూల్డ్ విమానం..
అనుకోని ప్రమాదం ఎదురైతే ఇలా తప్పించుకోండి.. తెలివైన తాబేళ్లు కథ
అనుకోని ప్రమాదం ఎదురైతే ఇలా తప్పించుకోండి.. తెలివైన తాబేళ్లు కథ
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసా?
నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసా?