Allu Arjun’s ‘Pushpa’: నో పార్టీస్.. నో ఫెస్టివల్స్.. మారేడుమిల్లిలో తెగ కష్టపడుతోన్న బన్నీ

సంక్రాంతి రోజు సెలబ్రిటీలంతా పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. మంచు ఫ్యామిలీ తిరుపతిలో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేస్తే మెగా ఫ్యామిలీ అంతా ట్రెండీ పార్టీలో చిల్ అయ్యారు.

Allu Arjuns Pushpa: నో పార్టీస్.. నో ఫెస్టివల్స్.. మారేడుమిల్లిలో తెగ కష్టపడుతోన్న బన్నీ

Updated on: Jan 17, 2021 | 4:35 PM

Allu Arjun’s ‘Pushpa’:  సంక్రాంతి రోజు సెలబ్రిటీలంతా పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. మంచు ఫ్యామిలీ తిరుపతిలో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేస్తే మెగా ఫ్యామిలీ అంతా ట్రెండీ పార్టీలో చిల్ అయ్యారు. అయితే గేదరింగ్స్‌లో అల్లు అర్జున్‌ మాత్రం మిస్‌ అయ్యారు. ప్రజెంట్‌ పుష్ప షూటింగ్ కోసం మారేడుమిల్లిలో ఉన్న బన్నీ సంక్రాంతి పండక్కి కూడా బ్రేక్‌ తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నారు.

ఈ మంథ్‌ ఫస్ట్ వీక్‌లో ఫారెస్ట్‌లోకి అడుగుపెట్టిన బన్నీ అప్పటి నుంచి బిజీ బిజీగా షూట్‌లో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే హీరో సెంట్రిక్‌ సాంగ్‌ను షూట్‌ చేశారు. ఇప్పుడు బ్రేక్ తీసుకుంటే తరువాత డేట్స్ అడ్జస్ట్ చేయటం కష్టమని భావిస్తున్న పుష్ప టీం… ఏం జరిగినా షూటింగ్‌కు మాత్రం బ్రేక్ ఇచ్చేది లేదని ఫిక్స్ అయ్యారు.

ప్రజెంట్ హీరో హీరోయిన్లకు సంబంధించిన సీన్స్‌ మాత్రమే తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్‌… ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌ వరకు ఈ కాంబినేషన్‌లోనే మేజర్‌ షూటింగ్ ఉంటుంది. ఆ తరువాతే బన్నీతో ఢీ కొట్టే విలన్ ఎవరన్నది ఫిక్స్ అవుతుంది. అంటే మార్చి నుంచి బన్నీ అసలు యాక్షన్‌ మొదలవుతుందన్నమాట.

Also Read : Ram Gopal Varma: సర్కార్ సిరీస్‌లో మరో సినిమా… క్లారిటీ ఇచ్చేసిన ఆర్జీవీ.. కుండబద్దలు కొట్టేశారుగా..!

Loading...
Unable to load recommendations.
Follow Us