Allari Naresh: మరో ఇంటెన్స్ రోల్‌లో నరేష్.. నాంది డైరెక్టర్‌తో నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసిన అల్లరోడు..

టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh)నటించిన సీరియస్ మూవీ నాంది. నరేష్ కెరీర్ లో వన్ ఆఫ్ దీ బెస్ట్ మూవీగా నాంది సినిమా నిలిచింది. నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నరేష్ ఇప్పుడు మరోసారి అదే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.

Allari Naresh: మరో ఇంటెన్స్ రోల్‌లో నరేష్.. నాంది డైరెక్టర్‌తో నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసిన అల్లరోడు..
Allari Naresh

Updated on: Jun 27, 2022 | 5:29 PM

టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh)నటించిన సీరియస్ మూవీ నాంది. నరేష్ కెరీర్ లో వన్ ఆఫ్ దీ బెస్ట్ మూవీగా నాంది సినిమా నిలిచింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నరేష్ ఇప్పుడు మరోసారి అదే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ‘నాంది’ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందటంతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తాజాగా నరేష్, విజయ్ కలయికలో రెండో చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. రక్తపు మరకలతో నిండిన సంకెళ్ళు వేసిన చేతులు, ఆ చేతుల నీడ గోడపై స్వేఛ్చగా ఎగిరే ఒక పక్షిలా కనిపించడం ఇంటరెస్టింగ్ గా వుంది. హై ఇంటెన్సిటీ తో కూడుకున్న ఈ పోస్టర్ క్యూరియాసిటీని పెంచింది. తన తొలి చిత్రాన్ని విలక్షణమైన కథతో తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల రెండవ సినిమా కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశారు. ఈ చిత్రం న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది ఈ సినిమాలో నరేష్ మరో ఇంటెన్స్ రోల్ లో కనిపించనున్నారు. అల్లరి నరేష్ , విజయ్ కనకమేడల క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం నరేష్ చేస్తున్న ”ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” పూర్తయిన తర్వాత ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం వివరాలు త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us