
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెలుగు-తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి చైతూ ఇంటెన్స్ ప్రీ లుక్ విడుదల చేశారు మేకర్స్. NC22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెకెక్కుతున్న ఈ మూవీపై తాజాగా విడుదలైన ప్రీలుక్ తో అంచనాలు పెరిగాయి. అయితే రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే..చైచూ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కృతి శెట్టి, శరత్‌కుమార్, సంపత్ రాజ్ కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం నాగ చైతన్యకు మొదటి తమిళ చిత్రం కాగా, వెంకట్ ప్రభు ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు.
ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. అరవింద్ స్వామి టీమ్‌లో చేరారు. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని మహేష్ మాథ్యూ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. నాగ చైతన్య, అరవింద్ స్వామిలని కలసి తెరపై చూడటం ఆసక్తికరంగా వుండబోతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.