
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నాడు నాగ చైతన్య. తెలుగు సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అక్కినేని నాగచైతన్య ఒకడు. జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చైతూ.. చివరిగా తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో ఇప్పుడు చైతూ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు లవ్ స్టోరీ చిత్రాలతో అలరించిన చైతూ.. ఇప్పుడు పీరియాడికల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు వృషకర్మ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే గతంలో నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. తన కెరీర్‌లో ఏ హీరోయిన్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే ప్రశ్నకు నాగ చైతన్య ఇచ్చిన సమాధానం అందరిని అవాక్ అయ్యేలా చేస్తుంది. చైతన్య ఇప్పటి వరకు 27 సినిమాల్లో నటించాడు. అలాగే 20మందికి పైగా హీరోయిన్స్ తో కలిసి నటించాడు. వీరందరిలో ఎవరితో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అనే ప్రశ్నకు యంగ్ హీరోయిన్ కృతిశెట్టి పేరు చెప్పాడు చైతన్య.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య ఇప్పటివరకు మీరు నటించిన హీరోయిన్స్ లో మీకు ఎవరితో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అని అడగ్గా.. ఏమాత్రం తడబడకుండా కృతిశెట్టి పేరు చెప్పాడు నాగ చైతన్య. అయితే నాగ చైతన్య సాయి పల్లవితో రెండు సినిమాలు, తమన్నాతో రెండు సినిమాలు, అదేవిధంగా రాశి ఖన్నాతో రెండు సినిమాలు చేశాడు. సమంతతో ఏకంగా నాలుగు సినిమాలు చేశాడు. వీరెవ్వరి పేరు కాకుండా కృతిశెట్టి పేరు చెప్పడం విశేషం.. కృతితో కూడా చై రెండు సినిమాలు ( బంగార్రాజు, కస్టడీ ) సినిమాలు చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి