Sai Pallavi: సాయి పల్లవి లిప్ లాక్ చేసిన ఏకైక హీరో అతడే.. ఆ సినిమా ఏదంటే

ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే అందం అభినయంతో కవ్వించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది ఈచిన్నది.

Sai Pallavi: సాయి పల్లవి లిప్ లాక్ చేసిన ఏకైక హీరో అతడే.. ఆ సినిమా ఏదంటే
Sai Pallavi

Updated on: Apr 27, 2023 | 7:04 AM

మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే అందం అభినయంతో కవ్వించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది ఈచిన్నది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పుపొందిన సాయి పల్లవి గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. చివరిగా విరాటపర్వం, గార్గి సినిమాల్లో నటించింది సాయి పల్లవి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు స్కిన్ షోలకు, రొమాంటిక్ సీన్స్ కు దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే..

అయితే సాయి పల్లవి లిప్ లాక్ చేసిన ఒక ఒక్క సినిమా ఏంటో తెలుసా..? ఆ హీరో ఎవరో తెలుసా..? గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే.. వరుస ఆఫర్స్ అందుకుంటున్న బ్యూటీస్ లో సాయి పల్లవి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ క్రమంలో ఆమె లిప్ లాక్ చేసిన ఒకే ఒక సినిమా లవ్ స్టోరీ.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓ లిప్ లాక్ సీన్ ఉంది. దాన్ని చాలా సెన్సిబుల్ గా హ్యాండిల్ చేశారు దర్శకుడు. దాంతో ఆ సీన్ ఒరిజినల్ లిప్ లాక్ లా ఉండదు. నిజానికి అది లిప్ కిస్ కాదు. ఆ సీన్ సినిమాలో హైలైట్ గా ఉంటుంది. హీరోయిన్ హీరో అంటే తనకు ఎంత ప్రేమవుందో వివరించే సన్నివేశంలో వస్తుంది ఈ లిప్ లాక్. కథకు అవసరం కావడంతో సాయి పల్లవి కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ సీన్ కు ఒప్పుకున్నారట

Follow Us