
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా లెనిన్. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకువచ్చింది. అయితే ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా అఖిల్, చిత్రయూనిట్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో నాగార్జున సందడి చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా అఖిల్, గెటప్ శీనుతో కలిసి సరికొత్త ప్లాన్ చేశారు. గెటప్ శీనుతో కలిసి ఇంటర్వ్యూ చేసిన వీడియోను లెనిన్ చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. సరదాగా కాసేపు పేరుతో చేసిన ఈ ఇంటర్వ్యూలో అఖిల్, గెటప్ శీను కలిసి టీ తాగుతూ మస్క్ బన్ తింటూ సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా సినిమా విషయాలతోపాటు ఫన్నీ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అపరిచితుడికి ఫ్రాంక్ కాల్ చేశాడు గెటప్ శీను.
ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్..
ఫ్రాంక్ కాల్ చేసి అఖిల్ తో మాట్లాడించారు. “నేను అఖిల్ అక్కినేనిని మాట్లాడుతున్నాను” అని అఖిల్ చెప్పడంతో “అవునా.. నేను నాగార్జున మాట్లాడుతున్నా” అంటూ అవతలి వ్యక్తి పంచ్ ఇచ్చాడు. దీంతో అఖిల్ ఒక్కసారిగా నవ్వేశాడు. నేను నిజంగానే అఖిల్ మాట్లాడుతున్నాని ఎన్నిసార్లు చెప్పినా అవతలి వ్యక్తి నమ్మడు. నాగచైతన్య ఎలా ఉన్నాడో చెప్పు.. నా మనవడి వాయిస్ నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా నాన్నా అఖిల్ అంటూ అక్కినేని నాగేశ్వరరావు వాయిస్ మిమిక్రీ చేశాడు అవతలి వ్యక్తి. దీంతో ఫోన్ తీసుకుని గెటప్ శీను అని చెప్పడంతో నేను సుధీర్ అంటూ మరోసారి పంచ్ ఇచ్చాడు అభిమాని. అలాగే అక్కినేని అఖిల్ నిజంగానే కాల్ చేశాడని గెటప్ శీను చెప్పడానికి ట్రై చేయగా.. నా నంబర్ అఖిల్ దగ్గర ఎందుకు ఉంటుంది అంటూ ప్రశ్నిస్తాడు అభిమాని.
ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్..
ఇక ఎంత చెప్పినా అభిమాని నమ్మకపోవడంతో గెటప్ శీను ఫోన్ కట్ చేస్తాడు. అయితే ఫోన్ లో సంభాషణ జరుగుతున్నంతసేపు అఖిల్ మాత్రం పడి పడి నవ్వుతూనే ఉంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషళ్ మీడియాలో వైరలవుతుంది. లెనిన్ చిత్రానికి ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించగా.. గెటప్ శ్రీను, శివాజీ, రాంకీ, ఈశ్వరరావు కీలకపాత్రలు పోషించారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood: చాలా టార్చర్ చేశారు.. ట్రైన్లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..
That’s @AkhilAkkineni8 and @getupsrinu3 making a random call… 🤣🤣🤣
One of the most hilarious sequences you will ever see ❤️
Saradaga Kaasepu – Interview out now 🫶🏻#Lenin #LeninOnJuly10th pic.twitter.com/Om4b7z8tWR
— Annapurna Studios (@AnnapurnaStdios) July 9, 2026
ఎక్కువమంది చదివినవి : నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..