అక్కినేని అందగాడు అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఇప్పటికే అఖిల్ తన హవా చూపించడం షురూ చేశారు. ఏజెంట్‌గా.. ట్రాన్స్ ఫాం అయి ఇరగదీస్తున్నారు. తన యాక్షన్ ఏంటో.. తన స్టామినా ఏంటో.. తన ఎనర్టీ ఎంటో.. దిమ్మతిరిగే రేంజ్లో అందరికీ చూపించేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన జెస్ట్ రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్ తో.. ఏకంగా యూట్యూబ్‌నే షేక్ చేస్తున్నారు. ఆప్టర్ సైరా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ఏజెంట్. అఖిల్ అక్కినేని హీరోగా మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా.. ఏప్రిల్ 28న రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అందర్నీ విపీరతంగా ఆకట్టుకుంటోంది. చూసిన వారందరికీ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు అక్కినేని అఖిల్. తాజాగా అఖిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నేను అక్కినేని వారసుడిగా కంటే, అఖిల్ గానే ఉండటానికి ట్రై చేస్తాను అన్నారు అఖిల్.
నేను అక్కినేని వారసుడిగా కంటే, అఖిల్ గానే ఉండటానికి ట్రై చేస్తాను. ప్రేక్షకులు నన్ను ఓన్ చేసుకుంటే నాకు హ్యాపీ. అక్కినేని వారసత్వం గురించి ఆలోచిస్తే అదే ముసలోకి వెళ్లిపోతాను. నేను నా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. సక్సెస్ లు వచ్చినా, ఫెయిల్యూర్ లు వచ్చినా చివరి దాకా నాలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు అఖిల్.