Lenin Movie: అయ్యగారు అదరగొట్టారు..అఖిల్ ‘లెనిన్’కు భారీ కలెక్షన్లు..రెండు రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లంటే?

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే రూ. 16 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన అయ్యగారి సినిమా వీకెండ్ లో మరింత అదరగొట్టింది. శనివారం (జులై11) లెనిన్ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి.

Lenin Movie: అయ్యగారు అదరగొట్టారు..అఖిల్ లెనిన్కు భారీ కలెక్షన్లు..రెండు రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లంటే?
Lenin Movie

Updated on: Jul 12, 2026 | 11:55 AM

ఎట్టకేలకు హీరో అఖిల్ ఓ మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు. లెనిన్ సినిమాతో ఫస్ట్ సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం (జులై 10) ప్రేక్షకు ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ అందుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. సోషల్ మీడియాలోనూ లెనిన్ సినిమా పట్ల పాజిటివ్ వైబ్ కనిపించింది. విలేజ్ స్టోరీ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే లెనిన్ సినిమాకు మొదటి రోజు దాదాపు రూ. 16 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక వీకెండ్ కావడంతో శనివారం (జులై10) అయ్యగారి సినిమాకు కలెక్షన్లు అద్దిరిపోయాయి. మొత్తమ్మీద రెండు రోజులకు కలిపి లెనిన్ సినిమాకు రూ. 37.2 కోట్లు వచ్చాయి. అంటే శనివారం ఒక్కరోజే అఖిల్ సినిమాకు రూ. 21 కోట్లు వచ్చాయన్నమాట. ఈ మేరకు కలెక్షన్ల వివరాలను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక ఓవర్సీస్ లోనూ లెనిన్ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడ ఇప్పటివరకు రూ. 425 K డాలర్లు వచ్చాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం లెనిన్ సినిమా జోరు చూస్తుంటే ఆదివారం ఈమూవీ రూ. 50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.

మురళి కిశోర్ అబ్బూరు తెరరకెక్కించిన లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. ప్రమోద్ పంజు, ఈశ్వరి రావు, రాంకీ, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, గెటప్ శీను, శత్రు, శరణ్య ప్రదీప్, ప్రవీణ్, మహేష్ అచంట, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. తమన్ ఈ సినిమాకు స్వరాలు అందించారు.

ఇవి కూడా చదవండి

50 కోట్లకు చేరువలో అఖిల్ ‘లెనిన్’..

ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us