Virat Kohli Biopic: విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించాలనుందిః అఖిల్ అక్కినేని

| Edited By: Anil kumar poka

Oct 16, 2021 | 5:04 PM

తెలుగు, తమిళం, హిందీ ఇలా భాష ఏదైనా కూడా సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. మరీ ముఖ్యంగా క్రికెట్‌లో..

Virat Kohli Biopic: విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించాలనుందిః అఖిల్ అక్కినేని
Akhil
Follow us on

తెలుగు, తమిళం, హిందీ ఇలా భాష ఏదైనా కూడా సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. మరీ ముఖ్యంగా క్రికెట్‌లో ఈ హవా మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే మిస్టర్‌ కూల్‌, మహేంద్ర సింగ్‌ ధోని బయోపిక్‌, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బయోపిక్‌లు రిలీజ్‌ కాగా.. ఈ ఏడాది క్రిస్మస్‌కు క్రికెట్‌ లెజెండ్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ విడుదల కాబోతుంది. అయితే తాజాగా రన్నింగ్‌ మిషెన్‌, విరాట్‌ కోహ్లీపై బయోపిక్‌ రాబోతుందన్న వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. కోహ్లీ బయోపిక్‌ నిజంగానే తెరకెక్కితే.. ఆ మూవీలో తాను నటించేందుకు రెడీగా ఉన్నానని అక్కినేని అఖిల్ అన్నాడు.

ఇప్పటికే రణవీర్ సింగ్ హీరోగా కపిల్ దేవ్ జీవితంపై తెరకెక్కుతున్న 83 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు అఖిల్‌. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో రూపొందే బయోపిక్ చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఇక ఎంతో మంది జీవితాలను విరాట్ కోహ్లీ ప్రభావితం చేశాడని, అతడి బయోపిక్ తీస్తే బాగుంటుందని చెప్పాడు. క్రికెట్ మీద అతడికున్న ఫ్యాషన్ తో సినిమా తీస్తే.. చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని, నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ బయోపిక్ తిరుగులేని కథగా నిలబడుతుందన్నాడు.

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!