Mrunal Thakur: ‘సీతారామం’తో మెప్పించిన మృణాల్ ఠాకూర్.. ఇక తెలుగులో బిజీ కానుందా ?..

|

Aug 06, 2022 | 2:26 PM

డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ తెరకెక్కించిన సీతారామం మూవీలో మృణాల్ సీతామహాలక్ష్మీ పాత్రలో కనిపించింది.

Mrunal Thakur: సీతారామంతో మెప్పించిన మృణాల్ ఠాకూర్.. ఇక తెలుగులో బిజీ కానుందా ?..
Mrunal Thakur
Follow us on

సీతారామం కంటే ముందుగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). హిందీ సీరియల్ కుంకుమ భాగ్య అప్పట్లో తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా చెల్లెలిగా నటించి బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకుంది మృణాల్. ఆ తర్వాత బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. లవ్ సోనీయా, సూపర్ 30, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, జెర్సీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్‎గా ఎదిగింది. ఇక ఇప్పుడు తెలుగు వెండితెరపై సీతారామం సినిమాతో సందడి చేసింది. నిన్న (ఆగస్ట్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాందించుకుంది. ఇక ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది మృణాల్.

డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ తెరకెక్కించిన సీతారామం మూవీలో మృణాల్ సీతామహాలక్ష్మీ పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే చెప్పుకోవాలి. సహజమైన నటన.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దొచుకుంది. ఆమె నటనలోని తాజాదనం ఆడియన్స్ చూపు తిప్పుకోనివ్వలేదు అనడంలో సందేహం లేదు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ బిజీ కానున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంటున్నారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. నటనతో ఆడియన్స్ హృదయాలను హత్తుకున్న ఈ చిన్నది..ఇకపై తెలుగులో రాణిస్తుందా ? లేదా ? అనేది చూడాలి ఇక.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.