దక్షిణ కొరియాలో విడుదలకు రెడీ అయిన “అంథాదూన్”

ఇండియన్ మూవీస్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఆయుష్మాన్  ఖురానా, టబూ, రాధికా ఆప్టే నటించిన అంథాధూన్ చిత్రం దక్షిణ కొరియాలో కూడా సందడి చేయనుంది. ఆగస్టు 28న  ఆ దేశంలో విడుదలయ్యేందుకు  రెడీ అయ్యింది. ఇక్కడ ఏకంగా 90 స్క్రీన్‌లపై ఈ చిత్రం రిలీజ్ కానుందని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా  ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను  పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఈచిత్రం విడుదలైన మూడు […]

దక్షిణ కొరియాలో విడుదలకు రెడీ అయిన అంథాదూన్

Edited By:

Updated on: Aug 25, 2019 | 5:19 AM

ఇండియన్ మూవీస్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఆయుష్మాన్  ఖురానా, టబూ, రాధికా ఆప్టే నటించిన అంథాధూన్ చిత్రం దక్షిణ కొరియాలో కూడా సందడి చేయనుంది. ఆగస్టు 28న  ఆ దేశంలో విడుదలయ్యేందుకు  రెడీ అయ్యింది. ఇక్కడ ఏకంగా 90 స్క్రీన్‌లపై ఈ చిత్రం రిలీజ్ కానుందని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా  ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను  పోస్ట్ చేశాడు.
ఇప్పటికే ఈచిత్రం విడుదలైన మూడు వారాల్లోనే చైనా దేశవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచిందని తెలిపాడు తరణ్.
అంథాదూన్ చిత్రం భారత్‌లో మాత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ మూవీలో టాబు, ఆయుష్మాన్ ఖురానా ముఖ్యపాత్రలు పోషించగా, రాధికా ఆప్టే కూడా ఓ  పాత్రలో మెరిశారు. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ డైరెక్టర్.