అదితీ చెప్పిన ఆసక్తికర అంశాలు

|

Sep 12, 2020 | 3:36 PM

'సమ్మోహనం', 'అంతరిక్షం' వంటి సినిమాలలో అందం, అభినయంతో ఆకట్టుకుంది అదితీరావు హైదరీ. తాజాగా నేచురల్ స్టార్ నాని 25వ సినిమా 'వి' లో అతడికి జంటగా నటించి మెప్పించింది.

అదితీ చెప్పిన ఆసక్తికర అంశాలు
Follow us on

‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ వంటి సినిమాలలో అందం, అభినయంతో ఆకట్టుకుంది అదితీరావు హైదరీ. తాజాగా నేచురల్ స్టార్ నాని 25వ సినిమా ‘వి’ లో అతడికి జంటగా నటించి మెప్పించింది. ఇటీవల ఈ అమ్మడు మాట్లాడుతూ నానినే తనకిష్టమైన కోస్టార్ అని చెప్పుకొచ్చింది. ‘అద్భుతమైన వ్యక్తి.. స్టార్ ఇమేజ్ అస్సలు చూపించడు.. సింపుల్ గా ఉంటాడు.. అందుకే నాకిష్టమైన కో స్టార్ నాని’ అని పేర్కొంది.

కాగా లాక్ డౌన్ సమయంలో తాను పెయింటింగ్ వేయడం నేర్చుకున్నానని తెలిపింది. ఇప్పుడు నేను ఏ వస్తువునైనా అందంగా మార్చగలను అని తను నేర్చుకున్న స్కిల్ గురించి వివరించింది. తన అభిరుచుల గురించి చెబుతూ.. వంట చేయడం ఇష్టమని  వెల్లడించింది. తనకిష్టమైన సినిమా బర్ఫీ  అని తెలిపింది. అందుకే ఆ సినిమాను లెక్కలేనన్ని సార్లు చూశానని పేర్కొంది. డైరెక్టర్ మణిరత్నం తీసే ప్రతి మూవీలోనూ నటించాలని ఉంటుందని ఆసక్తికకర అంశాన్ని వెల్లడించింది. కింద పడ్డా మళ్లీ లేచి పరిగెత్తడమే తన సిద్దాంతం అని వివరించింది. మన ఇతరులపై చూపే దయ, సహనం మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తుందని చెప్పుకొచ్చింది అదితి.

Also Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

అనంతపురం: పబ్జీ‌ గేమ్ మరో టీనేజర్ ప్రాణం తీసింది

లేటెస్ట్ అప్డేట్ : మూడు రోజుల కస్టడీకి నూతన్ నాయుడు