
తమిళ సీనియర్ నటులు విజయ్ కుమార్.. దివంగత మంజుల ముగ్గురు కూతుర్లలో వనితా విజయ్ కుమార్ ఒకరు. తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తూ ఆమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1995లోనే ఇప్పటి సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ సరసన హీరోయిన్‌గా చంద్రలేఖ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దేవి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా చేరువైంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. అయితే ఇక్కడే ఆమె రాంగ్ స్టెప్ తీసుకుంది. సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2000వ సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె పుట్టారు. అయితే వీరి వైవాహిక బంధం ఎక్కువ రోజులు సాగలేదు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారు. 2005లో ఆకాష్- వనితలు విడాకులు తీసుకున్నారు. త తర్వాత ఆనంద్ జైరాజన్ ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఈ పెళ్లి కూడా పెటాకులైంది. ఆ తర్వాత కొరియో గ్రాఫర్ రాబర్ట్‌తో వనితా విజయ్ కుమార్ తో డేటింగ్ చేసింది.
పెళ్లి చేసుకుంటారని అనుకున్న దశలో వీరు విడిపోయారు. దీని తర్వాత పీటర్ పాల్ అనే ఫోటోగ్రాఫర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది వనిత. కొన్నేళ్లు కలిసి ఉన్నా పీటర్ మద్యానికి బానిస కావడంతో అతనికి కూడా విడాకులు ఇచ్చేసిందీ అందాల తార. ఆ మధ్యన నాలుగో పెళ్లి వార్తలు వచ్చినా రూమర్లు గానే మిగిలిపోయాయి. ప్రస్తుతం తన కూతురిని హీరోయిన్ గా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉంది వనిత.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ అందాల తార తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు చేసుకుంది. అలాగే తన పెళ్లిళ్లు, రిలేషన్స్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. ‘నేను మూడు సార్లు పెళ్లి చేసుకున్నాను. మరికొందరితో డేటింగ్ చేశాను. కానీ కానీ ఈ రిలేషన్ సమయంలో ఎవరినీ నేను డబ్బులు అడగలేదు. గడిచిన 22 ఏళ్లుగా నేను నా కాళ్లపై నిలబడ్డానని గర్వంగా చెబుతాను. ఒక బంధం మీకు నచ్చనప్పుడు దాని నుంచి బయటకు రావడం తప్పు కాదు. నిజం చెప్పాలంటే అదే సరైన పని. సమాజం కానీ, ఇరుగుపొరుగువారు కానీ ఏమంటారోనని మనం ఆలోచించకూడదు. ఆఖరికి మీ కన్న తల్లిదండ్రులు మీకు వ్యతిరేకంగా నిలబడినా సరే.. ఒక బంధంలో మీరు నిజంగా సంతోషంగా లేనప్పుడు ఆ రిలేషన్ నుంచి బయటకు రావాలి. ఇదే మీకు మీరు చేసుకునే న్యాయం’ అని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.