తెలుగు సినిమాల్లో గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖా వాణి ఒకరు. అక్కగా, వదినగా, అమ్మగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది సురేఖా. తనదైన కామెడీ టైమింగ్‌తో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సురేఖా వాణి యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక సురేఖ వాణి కూతురు సుప్రిత గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుప్రిత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆమె నెట్టింట్లో ఎంతో మంది అభిమానులున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లైవ్ చాట్లు పెడుతూ… తన ఫాలోవర్లతో ముచ్చటలను పెడుతూ యాక్టివ్గా ఉంటారు. అయితే ఇక ఎప్పుడూ నెట్టింట్లో హల్చల్ చేస్తూ.. ఎంతో యాక్టివ్గా ఉంటున్న సుప్రిత.. త్వరలోనే సినీ అరంగేట్రం చేయబోతుందని.. హీరోయిన్గా రాబోతుందని పలు కథనాలు వెలువడ్డాయి.
అయితే ఇదే విషయంపై సురేఖ వాణి పలు సందర్బాల్లో స్పందించారు. తాజాగా ఆమె మరోసారి సుప్రిత విషయంపై మాట్లాడుతూ.. ప్రస్తుతం సుప్రిత చదుకుంటోంది. తను చదువు పై దృష్టి పెట్టడంతోపాటు డాన్స్లు, నటన ట్రైనింగ్ కూడా తీసుకుంటుందని చెప్పుకొచ్చింది. అలాగే తెలుగు డైలాగ్ డెలవరీ సరిగ్గా ఉండేందుకుగాను తెలుగు పండితుడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. సురేఖ వాణి మాటలను బట్టి చూస్తే.. ఇప్పట్లో సుప్రిత వెండితెరపైకి వచ్చే ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది. ఇక సుప్రిత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుండంతో.. ఆమె హీరోయిన్గా చేస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Vishal: మరోసారి షూటింగ్ సెట్లో ప్రమాదం… తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్..