
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా వారణాసి తెరకెక్కుతుంది. ఈ మూవీలో మహేష్ బాబు సరికొత్త లుక్‌లో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకప్పుడు ఆయనతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఓ హీరోయిన్.. చిన్నతనంలో మహేష్ బాబును ఎలా పిలిచేదో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యంగ్ హీరోయిన్ శ్రీదివ్య చిన్నతనంలోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు హీరోగా నటించిన ‘యువరాజు’ సినిమాలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. తాజాగా ఓ ఈవెంట్లో మహేష్ బాబుతో ఉన్న తన చిన్ననాటి ఫొటోపై శ్రీదివ్య స్పందించింది. ఆ సమయంలో మహేష్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది.
చిన్నప్పుడు మహేష్ బాబును తాను ‘అన్నా.. అన్నా’ అంటూ పిలిచేదాన్నని శ్రీదివ్య వెల్లడించింది. అంతేకాకుండా ఆయన తనకు చాక్లెట్లు ఇచ్చేవారని గుర్తుచేసుకుంది. చిన్నతనంలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకుంది. దీంతో మహేష్ బాబును శ్రీదివ్య అన్నా అంటూ పిలిచేదన్న విషయం ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ బాబుతో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలను శ్రీదివ్య పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్‌తో అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన శ్రీదివ్య.. ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తుంది. మహేష్ బాబు అభిమానులు సైతం ఈ వీడియోపై ఆసక్తి చూపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి