
రీసెంట్ డేస్ లో సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అలా అయితే నాలుగు పదుల వయసులోనూ పెళ్లి మాట ఎత్తకుండా ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. కుర్ర హీరోలు అందరూ పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను ఎంజయ్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం సింగిల్ గానే ఉంటూ సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా చాలా మంది పెళ్లి పేరు ఎత్తకుండా సైలెంట్ గా ఉంటున్నారు. తమ కో స్టార్స్ పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ.. ఓ అమ్మడు మాత్రం పెళ్లికి మాత్రం నో చెప్తుంది. ఎప్పటికీ సింగిల్ గానే ఉంటానంటుంది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.?
ప్రస్తుతం హీరోయిన్స్ అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే చాలు ఎలాంటి సాహసం చేయడానికైనా సరే రెడీ అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న పాన్ ఇండియా బ్యూటీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటా అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు యంగ్ బ్యూటీ శ్రుతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి.. హీరోయిన్ గానే కాదు సింగర్ గాను రాణిస్తుంది.
సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ ఇటీవలే మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమాలో ఓ సాంగ్ కూడా పాడింది. ఇక శ్రుతిహాసన్ గతంలో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా అనే వ్యక్తిని ప్రేమించిన విషయం తెలిసిందే.. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కాగా ఆతర్వాత శ్రుతికి బ్రేకప్ అయ్యింది.దాంతో అప్పటి నుంచి సింగిల్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూపోతుంది ఈ చిన్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు ఆరు సార్లు ప్రేమించానని చెప్పారు. అవన్నీ గాయాలతోనే ముగిశాయని తెలిపింది. ప్రస్తుతం ప్రశాంతమైన బాటలో ఉన్నాను. ఇలా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.