Shriya Saran: పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. కూతురికి ఏం నేర్పిస్తుందో మీరే చూడండి.. వీడియో

|

Nov 14, 2024 | 6:10 PM

టాలీవుడ్ హీరోయిన్ శ్రియాశరణ్ రీ ఎంట్రీలో అదరగొడుతోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉంటోంది. అలా తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో ఒకటి నెటిజన్లను ఎంటర్ టైన్ చేస్తోంది.

Shriya Saran: పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. కూతురికి ఏం నేర్పిస్తుందో మీరే చూడండి.. వీడియో
Shriya Saran
Follow us on

టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగించిన హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు.చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్, ఎన్టీఆర్, రవితేజ..‌ ఇలా స్టార్‌ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న అతి కొద్ది మంది కథానాయికల్లో శ్రియ కూడా ఒకరు. అయితే సినిమాల్లో బిజీగా ఉండగానే 2018లో రష్యన్ బిజినెస్ మెన్ ఆండ్రీ కొస్చీవ్ ను వివాహం చేసుకుంది శ్రియా శరన్. 2021 జనవరి 10న ఈ దంపతులకు రాధ అనే కూతురు పుట్టింది. పెళ్లి, పిల్లల తర్వాత కాస్త సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇటీవల రీ ఎంట్రీ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది శ్రియ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన పలు విషయాలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తుంటుంది. ఇక కూతురితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. అలా తాజాగా శ్రియ షేర్ చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ పిల్లలను ఎక్కువగా బయటకు తీసుకెళ్లరు. ఒక వేళ తీసుకెళ్లినా షాపింగ్స్ అంటూ తిప్పుతారు. అయితే శ్రియ మాత్రం తన కూతురిని పొలం పనులకు తీసుకెళ్లి అందరి దృష్టని ఆకర్షించింది. అక్కడ వరి పంను ఎలా నూర్పాలి అనే విషయాన్ని స్వయంగా తాన చేసి తన కూతురికి చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు శ్రియపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పొలం పనుల్లో శ్రియ, కూతురు రాధ.. వీడియో ..

దుమ్ము ఉంటుందని, అనారోగ్యం కలుగుతుందని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను కనీసం బయట ఆడుకునేందుకు పంపించడం లేదు. అలాంటిది శ్రియ తన కూతురిని పంట పొలాలకు తీసుకెళ్లడం, అక్కడ వ్యవసాయం గురించి చూపించడం నిజంగా అభినందనీయమంటున్నారు నెటిజన్లు.

కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో శ్రియ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.