సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అయిపోతున్నాయి. ఇప్పటికే ఓ వైపు పెళ్లిళ్లు జరుగుతుంటే మరో వైపు నటీనటుల విడాకుల వార్తలు ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలు, హీరోయిన్స్ విడాకులు ప్రకటించి అభిమానులకు షాక్ లు ఇచ్చారు. తాజాగా ఓ నటి కూడా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు. షీలా రాజ్‌కుమార్ ఈ హీరోయిన్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కోలీవుడ్ లో చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. ద్రౌపది, టూలెట్, మండేలా, రీసెంట్ గా లారెన్స్, ఎస్.జే సూర్య నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ లో నటించింది షీలా..
అలాగే విజయ్ అంథోని నటించిన బిచ్చగాడు 2 సినిమాలో విజయ్ సిస్టర్ పాత్రలో నటించి మెప్పించింది. షీలా నటించిన టూ లెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. తమిళ, మలయాళ భాషల్లో ఈ చిన్నది చాలా అవకాశాలు అందుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఇక ఈ అమ్మడు యాక్టింగ్ స్కూల్ నడిపిస్తున్న చోళన్ ను వివాహం చేసుకుంది. తాజాగా తన వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు ప్రకటించింది. సోషల్ మీడియాలో తానూ చోళన్ విడిపోతున్నట్టు ప్రకటించి చివరిలో థాంక్యూ చోళన్ అని రాసుకొచ్చింది. అయితే షీలా ఎందుకు తన భర్తతో విడిపోతుందో తెలుపలేదు. ఎలాంటి కారన్మలు చెప్పకుండా కేవలం విడిపోతున్నట్టు మాత్రమే ప్రకటించింది షీలా.
திருமண உறவிலிருந்து நான் வெளியேறுகிறேன்
நன்றியும் அன்பும் @ChozhanV— Sheela (@sheelaActress) December 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.