Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన నటి శరణ్య పొన్వన్నన్. 90వ దశకంలో చిత్రాలలో ఎంతో మంది హీరోయిన్ గా అలరించింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో తల్లిగా నటిస్తూ మెప్పిస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొంత మంది హీరోలకు తల్లిగా అస్సలు నటించనని అన్నారు.

Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..
Saranya

Updated on: Jul 25, 2026 | 1:06 PM

శరణ్య పొన్వన్నన్.. ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నాయగన్ చిత్రంతో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేశారు. 1987లో విడుదలైన నాయగన్ చిత్రంలో శరణ్య కమల్ హాసన్ సరసన నటించి మెప్పించారు. కమల్ సరసన ఆమె నటించిన తొలి చిత్రం భారీ విజయం సాధించింది. ఆ తర్వాత తమిళ చిత్రసీమలోని అగ్ర హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సహయ నటుడు పొన్వన్నన్ తో ప్రేమలో పడి 1995లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం తర్వాత దాదాపు 8 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె సహయ నటిగా రాణిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..

దాదాపు 8 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె అలై చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. శివ కార్తికేయన్ నటించిన రేమో సినిమాతో ఆమెకు మరోసారి గుర్తింపు వచ్చింది. ఆమె చివరిసారిగా ధనుష్ నటించిన ‘నిలవుక్కు ఎన్మెల్ ఎన్నడి కోపం’ చిత్రంలో కనిపించారు. తల్లి పాత్రలతో ఆమె విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇద్దరూ హీరోలకు తాను తల్లిగా అస్సలు నటించనని అన్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. రజినీకాంత్, మోహన్ లాల్.

ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..

గతంలో ఒక ఇంటర్వ్యూలో అవకాశం వస్తే రజినీ సర్ తో కలిసి తల్లిగా నటిస్తారా అని హోస్ట్ అడగ్గా.. తాను రజినీ, మోహన్ లాల్ ఇద్దరికి తల్లిగా అస్సలు నటించనని అన్నారు. ఒకవేళ తల్లి పాత్ర చేసినా.. వారితో కలిసి నటించనని అన్నారు. ఒకవేళ వారితో కలిసి నటించే అవకాశం రాకపోతే అస్సలు నటించనని అన్నారు. ఎందుకంటే వారిద్దరూ తన మనసులో ఉన్న హీరోలు అని అన్నారు. తాను స్కూల్లో ఉన్నప్పుడు రజనీకాంత్ అభిమానిని. అప్పట్లో ఆయన ఫోటోలన్నింటినీ నా డెస్క్‌కు అంటించేదాన్ని అని.. వాటిని తన తల్లి చించిపారేసేది అని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..

Follow Us