Samantha: వాళ్లు అందుకే వస్తారు.. అభిమానుల తోపులాట ఘటనపై సమంత రియాక్షన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ లోని ఓ షోరూమ్ ప్రారంభోత్సావానికి వెళ్లిన ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అభిమానుల నుంచి తప్పించుకుని బయటకు రావడానికి సామ్ అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది.

Samantha: వాళ్లు అందుకే వస్తారు.. అభిమానుల తోపులాట ఘటనపై సమంత రియాక్షన్
Samantha

Updated on: Dec 25, 2025 | 5:19 PM

ఇటీవల కాలంలో హీరోయిన్ల పట్ల అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. మొన్న ది రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్‌ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు అందరినీ షాకింగ్ కు గురి చేసింది. ఈ ఘటన మరవక ముందే మరో హీరోయిన్ సమంతకు కూడా అలాంటి చచేదు అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శారీస్ షోరూమ్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో సామ్‌ను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమం ముగించుకుని ఆమె బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. సమంతను అభిమానులు చుట్టుముట్టారు. ఆమెతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్రమైన గందర గోళం ఏర్పడింది. చివరికి బాడీ గార్డ్స్ ఎంతో కష్టపడి సమంతను కారు వరకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. తాజాగా ఈ ఘటనపై సమంత స్పందించింది.

‘అభిమానులు మన దగ్గరకు వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు కేవలం ప్రేమతో, ఆనందంతో, ఒక ఫొటో లేదా సెల్ఫీ కోసమో, హాయ్ చెప్పేందుకు మన దాకా వస్తారు. వారిలో చాలా మందికి ఎలాంటి చెడు ఉద్దేశాలు, ఆలోచనలు ఉండవు. ఆ ప్రేమను మనం గౌరవించాలి’ అని సమంత చెప్పుకొచ్చింది. అయితే జనాలు ఎక్కువగా ఉన్న చోట తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని, నిర్వాహకులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సామ్ సూచించింది. అభిమానులు కూడా కాస్త సంయమనం పాటించాలని ఆమె సూచించింది.

అభిమానుల మధ్యలో సమంత.. వీడియో..

సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను ఇబ్బంది పెట్టినా కూడా అభిమానుల పట్ల గౌరవముందంటూ ఆమె చేసిన కామెంట్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. సామ్ ది గొప్ప మనసంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే.. శుభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ మూవీలో కీలకపాత్రలో మెరిసిన సామ్.. అటు నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి