Raashi Khanna: నా సంతకాన్ని పచ్చబొట్టు వేయించుకుని వచ్చాడు.. రాశీ ఖన్నా ఆసక్తికర కామెంట్స్..

ఇప్పటివరకు తాను నటించిన అన్ని చిత్రాల్లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోని యామిని పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

Raashi Khanna: నా సంతకాన్ని పచ్చబొట్టు వేయించుకుని వచ్చాడు.. రాశీ ఖన్నా ఆసక్తికర కామెంట్స్..
Rashi Khanna

Updated on: Jul 02, 2022 | 1:35 PM

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యింది హీరోయిన్ రాశీఖన్నా (Rashi Khanna). అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. తాజాగా రాశీఖన్నా కథానాయికగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మ్యాచో హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

ఇప్పటివరకు తాను నటించిన అన్ని చిత్రాల్లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోని యామిని పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అలాగే.. ఊహలు గుసగుసలాడే సినిమాలోని ప్రభావతి, తొలిప్రేమ మూవీలోని వర్ష పాత్రలు ఇష్టమని తెలిపింది. ముఖ్యంగా యామిని పాత్రకు తాను కనెక్ట్ అయ్యానని.. కాకపోతే ఆ రోల్ ఎవరికీ నచ్చలేదని తెలిపింది. రాశీ ఖన్నా మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని గొప్ప పాత్రలలో నటించాలని ఉంది. నటిగా మారడం వలన నాకు చాలామంది అభిమానం సొంతమైంది. ప్రతిరోజు పండగే సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు ఓ అభిమాని నా వద్దకు వచ్చి.. నాకు వీరాభిమాని అని చెప్పి చేతిపై ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరాడు. ఆ తర్వాత రోజు నేను సంతకాన్ని పచ్చబొట్టు వేయించుకుని వచ్చాడు. ఆ క్షణం చాలా ఆనందంగా అనిపించింది. అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞురాలినే అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us