
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప , పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పుష్పకు ముందు అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అట్లీ. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. దీపికాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టేక్నీషన్స్ పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ గురించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీకి డాన్స్ నేర్పించింది నేనే అని ఓ హీరోయిన్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి రాధిక శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన రాధిక శరత్ కుమార్. ప్రస్తుతం సహాయక పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అలాగే పలు టీవీ షోలకు రాధిక శరత్ కుమార్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
కాగా ఓ కంటెస్టెంట్ పుష్ప సినిమాలోని సాంగ్ కు డాన్స్ చేసింది. ఆమె డాన్స్ పర్ఫామెన్స్ తర్వాత రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి నేనే కారణం అంటూ రాధికా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. రాధిక ఇలా చెప్పడంతో వెంటనే నిహారిక ఎందుకు రాధిక గారు అంటూ ప్రశ్నించారు.. దాంతో రాధికా మాట్లాడుతూ.. గీత ఆర్ట్స్ లో నేను ఓ సినిమా చేశా.. ఆ సినిమాలో ఓ అబ్బాయిని ఎత్తుకొని రైల్వే ట్రాక్ పై పరిగెడతా.. ఆ అబ్బాయి ఎవరో కాదు అల్లు అర్జున్. బన్నీను ఎత్తుకొని రైల్వే ట్రాక్ మీద పరిగెడుతూ డాన్స్ ఎలా చేయాలో నేర్పించాను అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.