వాళ్ల ప్రవర్తన వేరేలా ఉంటుంది.. షాకింగ్ విషయం చెప్పిన రాశీ ఖన్నా.. అసలేమైందంటే

తెలుగులో ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఇప్పుడు తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తుంది. తెలుగు సినిమా ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేసినా తమిళ అభిమానుల ఆదరణ పొందుతున్న నటి రాశీఖన్నా. ఆమె తమిళంలో చివరిసారిగా కనిపించిన సినిమా ప్యాలెస్ 4. సుందర్ సి తెరకెక్కించిన అచో అచోలో సినిమాలో తమన్నాతో కలిసి ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

వాళ్ల ప్రవర్తన వేరేలా ఉంటుంది.. షాకింగ్ విషయం చెప్పిన రాశీ ఖన్నా.. అసలేమైందంటే
Rashi Khanna

Updated on: Oct 05, 2025 | 6:19 PM

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రాశి ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ. రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది. దాంతో రాశీ ఖన్నా టాలీవుడ్ కు దూరం అవుతుంది అని అంటున్నారు కొందరు అభిమానులు. కానీ ఈ అమ్మడు అవకాశం వస్తే ఏ బాషలోనైనా నటించి మెప్పిస్తాను అంటుంది.

ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?

ప్రస్తుతం యంగ్ బ్యూటీస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వారికి గట్టిపోటీ ఇచ్చేలా రాశీ ఖన్నా కూడా గగ్లామర్ గేట్లు ఎత్తేసి కవ్విస్తుంది. ఈ మధ్య కాలంలో రాశిఖన్నా పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు. ఆ రేంజ్ లో అందాలతో అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాజగా రాశిఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..

తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. బాలీవుడ్ కు టాలీవుడ్ కు తేడా ఏంటో చెప్పింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ కు 9 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అదే బాలీవుడ్ సినిమాలకు ఏకంగా 12గంటలు పని చేయాల్సి ఉంటుందని తెలిపింది రాశీ ఖన్నా. టాలీవుడ్ కు బాలీవుడ్ కు చాలా తేడా ఉంటుంది. కానీ నాకు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. సౌత్ ఇండస్ట్రీలోని నటీనటులు చాలా ప్రైవేట్ గా ఉంటారు. తమపని తాము చేసుకుంటూ ఉంటారు. అలాగే తాము చేసే పనిలో లీనమైపోయి డెడికేషన్ తో పనిచేస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్ లో అలా కాదు.. అక్కడి వారు ఆడంబరానికి పోతారు.. సౌత్ నటీనటులుగా ప్రవర్తించరు అని చెప్పుకొచ్చింది రాశీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us