బాలీవుడ్‌లో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రజెంట్ హాలీవుడ్‌లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న పీసీ.. ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ మీడియాతో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పీసీ. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే హాలీవుడ్ వైపు అడుగులు వేశారు టాలెంటెడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. అమెరికన్ టీవీ షో క్వాంటికో కోసం పీసీని ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్నారు హాలీవుడ్ మేకర్స్. వెస్ట్రన్ వరల్డ్ నుంచి వచ్చిన తొలి అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్న ఈ బాలీవుడ్ భామ హాలీవుడ్‌లోనూ జెండా పాతేశారు.
పీసీకి తొలి షోతోనే హాలీవుడ్‌లో మంచి గుర్తింపు రావటంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టీవీ షోతో వెస్ట్రన్ జర్నీ స్టార్ట్ చేసిన ప్రియాంక.. అక్కడ సూపర్ హిట్ సినిమా ప్రాంచైజీల్లోనూ నటించి హాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్‌లో చేరిపోయారు. అయితే అక్కడ కెరీర్ సాఫీగానే ఉన్నా.. ఎందుకు మళ్లీ బాలీవుడ్ వైపు చూస్తున్నారు ప్రియాంక. హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాక ఏళ్ల తరబడి ఇండియాకు దూరంగా ఉన్న పీసీ.. ఈ మధ్య మాత్రం రెగ్యులర్‌గా భారత్‌కు వచ్చి వెళుతున్నారు. టైమ్ తీసుకొని మరీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌కు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు.
ప్రియాంక రివర్స్ గేర్ అక్కడితో ఆగిపోలేదు. ఈ మధ్య బాలీవుడ్ మీడియాతోనూ టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పీసీ. రెగ్యులర్‌గా తన కెరీర్ ఎర్లీ డేస్‌కు సంబంధించిన కామెంట్స్‌తో బీటౌన్ హెడ్‌లైన్స్‌లో కనిపిస్తున్నారు. దీంతో పీసీ యూటర్న్‌కు రీజన్ ఏంటన్న డిస్కషన్ బాలీవుడ్‌లో గట్టిగా జరుగుతోంది.