Actress Pratyusha Case: 24 ఏళ్లకు న్యాయం..! ప్రత్యూష కేసులో అసలేం జరిగింది..

తన బిడ్డ మరణం వెనుక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల హస్తం ఉందని బలంగా నమ్మిన ప్రత్యూష తల్లి.. అది ఆత్మహత్య కాదు, సామూహిక అత్యాచారం చేసి చంపేశారంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. సిద్ధార్థ రెడ్డికి శిక్ష తగ్గిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2012లో సుప్రీంకోర్టుకు వెళ్లారు సరోజినీ దేవి. కాని, విధి ఎలాంటి ఆట ఆడిందంటే.. ఆ కేసు విచారణకు రావడానికే 13 ఏళ్లు పట్టింది.

Actress Pratyusha Case: 24 ఏళ్లకు న్యాయం..! ప్రత్యూష కేసులో అసలేం జరిగింది..
Actress Pratyusha Death Case

Updated on: Feb 17, 2026 | 9:49 PM

ఒక కల.. ఒక ప్రేమ.. ఒక విషాదం.. ప్రత్యూష మరణం.. ఇప్పటికీ ఓ సంచలనం.. తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి, అంతే వేగంగా కనుమరుగైన తార ప్రత్యూష. ఆమె మృతి వెనుక ఉన్న రహస్యం, ఆమె తల్లి సరోజినీదేవి చేసిన రెండు దశాబ్దాల సుదీర్ఘ న్యాయపోరాటం.. సుప్రీంకోర్టు తుది తీర్పుతో ఒక ముగింపునకు చేరింది. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రత్యూష.. ‘నవ్వుల రాణి’గా గుర్తింపు తెచ్చుకుని టాప్ హీరోయిన్ అవుతుందనుకున్న తరుణంలో.. ‘ప్రేమ’ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తనతో పాటు ఇంటర్మీడియట్ చదువుకున్న సిద్ధార్థ్‌ రెడ్డితో ఆమె ప్రేమలో పడ్డారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. ప్రత్యూష, సిద్ధార్థ అప్పటికే ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడం ఈ మొత్తం విషాదానికి బీజం వేసింది. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదనే కారణంతో సిద్ధార్థ అండ్ ప్రత్యూష ఆత్మహత్యాయత్నం చేశారని కూడా రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఆ రోజు ఒకే కారులో వెళ్లిన ఈ ఇద్దరూ.. పురుగుల మందు కొనుక్కున్నారు. కూల్‌డ్రింక్‌లో కలుపుకొని కారులోనే తాగారు. బట్.. అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అని తెలుసుకని, ఎలాగైనా బతకాలనుకున్నారు....

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి