
ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు నిందితుడు సిద్ధార్ధ్‌రెడ్డి. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి.. 24 ఏళ్ల తర్వాత టీవీ9 కెమెరాకు చిక్కాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా..సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నాడు. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యేనంటూ ఆమె తల్లి న్యాయపోరాటం చేశారు. ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలపై ట్రయల్ కోర్టు సిద్ధార్థ్‌రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తర్వాత శిక్షాకాలాన్ని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంని ఆశ్రయించాడు సిద్ధార్థ్. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీం. ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపించినట్లుగా నిర్ధారించిన కోర్టు.. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ రోజు కోర్టులో లొంగిపోయాడు సిద్ధార్ద్ రెడ్డి.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అనంతరం టీవీ9తో మాట్లాడారు ప్రత్యూష తల్లి సరోజిని.
ఆ రోజు ఆస్పత్రిలోనే చాలా అన్యాయం జరిగిందన్నారు.. ఫిబ్రవరి 23న వెళ్లి చూసేసరికి ఆమె గొంతుపై గాట్లు కనిపించాయన్నారు. ఆమె దుస్తులను కూడా ఆస్పత్రి వారు కాల్చేయడం షాకింగ్ అన్నారు సరోజిని. ప్రత్యూష చనిపోయిన సమయంలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు ఆమె తల్లి. వారిద్దరు ప్రేమించుకున్న సమయంలో సిద్ధార్థను నమ్మానని.. అయితే అతడి మెంటాలిటీ ఇంత క్రూయల్ అనుకోలేదన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి