భర్త కోసం సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు కొట్టుకోవడం చూసుంటాం.. నిజ జీవితంలోనూ.. ఇలాంటి న్యూసులు చదివే ఉంటాం..! నెట్టింట వైరల్ అవుతుండే వీడియోలను కూడా చూసే ఉంటాం..! కాని వీటన్నింటికి మించి రియల్ లైఫ్‌లో ఓ హీరో కోసం తన భార్య, ప్రేయసి నడిరోడ్డు పై బాహాబాహికి దిగడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..? చూడలే కదా.. అయితే స్టోరీ చదవాల్సిందే. ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు భూషణ్ మొహంతీ. తను రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ ప్రకృతి మిశ్రాతో కలిసి ఓ సినిమాలో నటించారు. సినిమాలో దిబెస్ట్ కెమెస్ట్రీ పండించారు. ఆ ఎఫెక్ట్ తో నిజజీవితంలో కూడా.. చాలా దగ్గరయ్యారు. రిలేషన్లోకి మారిపోయారు. అయితే అప్పటికే పెళ్లి చేసుకున్న భూషణ్ వైఫ్ తృప్తి సత్పతకు ఈ విషయం తెలియడంతో.. ఒక్క సారిగా ఊగిపోయారు.
ప్రకృతి- భూషణ్ కలిసి ఎక్కడికో కారులో వెళుతున్నారని తెలుసుకుని అక్కడ ప్రత్యక్షం అయ్యారు. వారితో గొడవ పడ్డారు. కారులో కూర్చున్న హీరోయిన్ ప్రకృతిని జుట్టు బట్టి మరీ బయటికి ఈడ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోని హీరోయిన్ అక్కడి నుంచి లగెత్తారు. ఓ ఆటోను పట్టుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఇక మరో పక్క తృప్తి భర్త స్టార్ హీరో భూషణ్ కూడా అక్కడ నుంచి తుర్రుమన్నారు. అయితే ఈ తతంగాన్నంతా… వీడియో తీసిన అక్కడి వారు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెట్టంట ఎట్ ప్రజెంట్ ట్రెండ్ అవుతోంది.. ఈ స్టార్ ఎఫైర్ వార్ వీడియో..!
ଜଣେ ଫିଲ୍ମ ଷ୍ଟାର ବର୍ଷା କୁ ଛାଡ଼ିଲେ
ଆଉ ଏ ଜଣେ ପରକୀୟା ପ୍ରୀତି ରେ
ଉବୁଟୁବୁ, ପର ଘର ଭିତରେ ପଶି
ବାହା ହେଇ ଥିବା ସୁନା ସଂସାର କୁ ଏମିତି
ମିଛ ପ୍ରେମ ରେ ଭାଙ୍ଗି ଦିଆ ଯାଇ ପାରେ
ଏସବୁ ବଡ଼ ବଡିଆ ଙ୍କ ଘରେ ହୁଏ
, ଧନ୍ୟ ତୁମ ସଂସ୍କାର ଧନ୍ୟ ତୁମର ପାଠ ପଢା
ଶିକ୍ଷା ଦିକ୍ଷା#BabushaanMohanty #PrakrutiMishra pic.twitter.com/BpuKGLs3hI— ViswoGuru_India (@Anjali__basu) July 24, 2022