Pragya Jaiswal: మొన్న రకుల్‌, నేడు ప్రగ్యా.. గడ్డకట్టిన నీటిలో ఈ బికినీ స్నానాలు ఎందుకంటే..

మొన్నటి మొన్న అందాల తార రకుల్ ప్రీత్‌ సింగ్‌ గడ్డ కట్టే నీటిలో స్నానం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. గడ్డ కట్టే నీటిలో అది కూడా బికినీలో నీట మునిగిన ఈ చిన్నది నెట్టింట తెగ హల్చల్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఇది ఏంటా అని నెటిజన్లు తెగ సెర్చ్‌ చేశారు...

Pragya Jaiswal: మొన్న రకుల్‌, నేడు ప్రగ్యా.. గడ్డకట్టిన నీటిలో ఈ బికినీ స్నానాలు ఎందుకంటే..
Actress pragya jaiswal

Updated on: Jun 17, 2023 | 12:30 PM

మొన్నటి మొన్న అందాల తార రకుల్ ప్రీత్‌ సింగ్‌ గడ్డ కట్టే నీటిలో స్నానం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. గడ్డ కట్టే నీటిలో అది కూడా బికినీలో నీట మునిగిన ఈ చిన్నది నెట్టింట తెగ హల్చల్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఇది ఏంటా అని నెటిజన్లు తెగ సెర్చ్‌ చేశారు. దీనిని క్రియో థెరపీగా పిలుస్తారు. ఈ థెరపీ ద్వారా శరీరంలో కణజాల గాయలకు చికిత్స చేస్తారు. కణజాలల గాయలను తగ్గించుకోవడానికి ఈ థెరపినీ సెలబ్రిటీలు ఉపయోగిస్తుంటారు. గాయాలు మానిన తర్వాత వచ్చే నొప్పులు, అల్జీమర్స్‌తో పాటు కొన్ని స్కిన్‌ రిలేటెడ్‌ వ్యాధులు కూడా తగ్గుతాయి.

ఇదిలా ఉంటే రకుల్‌ మొదలు పెట్టిన ఈ ట్రెండ్‌ టాలీవుడ్‌లో కొనసాగుతోంది. తాజాగా మరో అందాల తార ప్రగ్యాజైస్వాల్ కూడా క్రియో థెరపినీ ఫాలో అయ్యింది. గడ్డ కట్టే నీటిలో స్నానం చేసింది. ఓవైపు మంచు గడ్డ కట్టిన చలి, మరోవైపు బికినీలో సెగలు పుట్టించిందీ బ్యూటీ. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసిన ఈ అందాల తార ఫైర్‌ అండ్‌ ఐస్‌ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఈ థెరపీలో భాగంగా ప్రగ్యా 80C ఉష్ణోగత్ర తర్వాత వెంటనే -15C చల్లటి నీటిలో మునకేసింది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ప్రగ్యా.. ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఆనందాన్ని కలిగిచింది. గడ్డ కట్టే చలిలో మునకవేసిన అనుభూతిని మాటల్లో వివరించడం అంత సులభం కాదు. మీరు కూడా అనుభవించాల్సిందే. ఐస్‌ స్విమ్మింగ్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. స్నేహితులతో కలిసి ఇలా చేయడం మరింత సంతోషాన్నిచ్చింది అంటూ రాసుకొచ్చింది. ప్రగ్యా ప్రస్తుతం ఫిన్‌లాండ్‌లో హాలీడేను ఎంజాయ్‌ చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..