
కింగ్ నాగార్జున తాజాగా 67వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నాగ్. సినిమాలు చేస్తూనే మరో వైపు బుల్లి తెర గేమ్ షో బిగ్ బాస్ షోను విజయవంతంగా హోస్ట్ చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 10 మొదలుకానుంది. అయితే ఆగస్టు 29న కింగ్ నాగార్జున పుట్టిన రోజు. నాగ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న 100వ సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు. అంతే కాదు నాగార్జున బర్త్ డేకు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆయనకు విషెష్ తెలుపుతూ సందడి చేశారు. ఫ్యాన్స్ తో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా నాగార్జున బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే ఓ హీరోయిన్ నాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఓ ఫోటోను షేర్ చేసింది.
ఫోటో షేర్ చేయడం వరకూ బాగానే ఉంది. అయితే ఆ ఫొటోకు బ్యాగ్రౌండ్ లో ఓ అసభ్యకరమైన ఆడియో యాడ్ చేసింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో నెట్టింట ఓ రేంజ్ లో ట్రోల్స్ మొదలయ్యాయి. ఫోటోను అమ్మడి పోస్ట్ ను షేర్ చేస్తూ నెటిజన్స్ కొందరు మీమ్స్ చేశారు. అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంతో తప్పు తెలుసుకున్న ఆమె ఆ పోస్ట్ ను వెంటానే డిలీట్ చేసింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు టాలీవుడ్ క్రేజీ అండ్ హాట్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్.
ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాకపోతే పెద్ద అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గానూ సినిమాలు చేసింది. అయినా లాభం లేకపోయింది. దాంతో ఈ చిన్నది సినిమాల స్పీడ్ తగ్గించింది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు, క్రేజీ పోస్ట్ లు చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు ప్రగ్య నాగార్జున మీద చేసిన పోస్ట్ ను డిలీట్ చేసినప్పటికీ కొందరు ఆమె పోస్ట్ ను డౌన్ లోడ్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.