
ప్రస్తుతం థియేటర్ల వద్ద భీమ్లా నాయక్ (Bheemla Nayak) హవా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈరోజు విడుదలైన భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్… రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ సూపర్ హిట్ అంటూ పబ్లిక్ రివ్యూ వచ్చేసింది.
ఇప్పటికే ఈ సినిమాపై బండ్ల గణేశ్, లోకేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేసింది. తన వాట్సాప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్లో షేర్ చేసుకుంది. అందులో ఓ వ్యక్తి స్టేటస్‌కు వాట్ అంటూ రిప్లై ఇచ్చింది పూనమ్.. దానికి అవతలి వ్యక్తి స్పందిస్తూ… సినిమాకు వచ్చిన అక్క.. బావ సినిమా.. 8am… అంటూ ఫైర్ ఎమోజీస్ ఇచ్చాడు. ఇందుకు పూనమ్ సిగ్గుపడుతున్నట్టుగా ఎమోజీస్ షేర్ చేస్తూ.. నిజాయితీగా రివ్యూ చెప్పమని అడిగారు. సరే అక్క అంటూ అవతలి నుంచి రిప్లై వచ్చింది. .. ఆ తర్వాత కాసేపటికి అవతలి వ్యక్తి నుంచి అక్కా సినిమా హిట్.. ట్రస్ట్ మీ.. ప్రామీస్ చెబుతున్నా అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ చాట్‌ను స్క్రీన్ షాట్ చేసింది. పూనమ్ షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఎవరు ఎవరితో చాట్ చేస్తున్నారు..అక్కా.. తమ్ముడు ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Bheemla Nayak Review: సమ్మర్ సినిమాలకు శుభారంభం.. భీమ్లా నాయక్.. పర్ఫెక్ట్ మూవీ రివ్యూ..
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్.. ఏమన్నారంటే..
Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా