ఆ సినిమాలో నా పాత్రకు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు.. అలాగే మీమ్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయో: నయనతార

హీరోయిన్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది

ఆ సినిమాలో నా పాత్రకు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు.. అలాగే మీమ్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయో: నయనతార
Nayanthara

Updated on: Aug 31, 2026 | 5:41 PM

అందాల భామ నయనతార రీసెంట్ గా టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. యష్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమాకు మొదటి షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమాపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే నయనతార గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో నయనతార నటించిన అదుర్స్ చిత్రంలోని చంద్రకళ పాత్ర గురించి ప్రస్తావన వచ్చింది. తెలుగులో తాను అనేక చిత్రాలు చేసినప్పటికీ, చంద్రకళ పాత్రకు మాత్రం ఒక ప్రత్యేకమైన, ఎప్పటికీ  తగ్గని క్రేజ్ ఉందని నయనతార అన్నారు. ఈ పాత్రకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ ఎంతగా ట్రెండ్ అవుతున్నాయో చూపిస్తూ ఇంటర్వ్యూయర్ కొన్ని మీమ్స్‌ను చూపించారు.

అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది

ఈ మీమ్స్‌లో మిస్టర్ బట్టు చంద్రకళతో ప్రేమలో పడటం అనే అంశం ప్రముఖంగా కనిపించింది. ఆసక్తికరంగా, ఈ మీమ్స్ నయనతార వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ముడిపడి ఉండటం విశేషం. ఆమెకు పెళ్లి అవుతుందని తెలిసినప్పుడు, అలాగే ఆమె పిల్లలు పుట్టిన తర్వాత కూడా చంద్రకళ మీమ్స్ రూపంలో స్పందించడం చూసి నయనతార ఆశ్చర్యపోయారు. ఈ మీమ్స్‌ను తాను ఎప్పుడూ చూడలేదని, అవి ఎంత క్యూట్‌గా ఉన్నాయో అని నవ్వుతూ అన్నారు. వినాయక్ గారు అప్పట్లోనే ఇది చూపించారు అని మీమ్స్ వెనుక ఉన్న క్రియేటివిటీని గుర్తుచేసుకున్నారు.

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ

అసలు ఇవన్నీ అప్పట్లో ఫుల్‌గా ట్రెండింగ్‌లో ఉండేవి అని ఇంటర్వ్యూయర్ చెప్పగా, నయనతార “ఓ ఐ డింట్ నో దిస్” అంటూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చివరగా, “బట్టుకి అన్యాయం జరిగిపోయింది” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తంగా, ఈ ఇంటర్వ్యూ నయనతార వ్యక్తిగత, వృత్తిగత జీవితంలోని కొన్ని అందమైన క్షణాలను, తన పాత్రలకు ప్రేక్షకుల నుంచి లభించే అనూహ్యమైన ప్రేమగురించి అనేక విషయాలు పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us