Mrunal Thakur: మృణాల్ ఫేవరెట్ హీరో అతనేనట.. ఊహించని పేరు చెప్పిన ముద్దుగుమ్మ

కాలేజీ రోజుల్లోనే మరాఠీ సీరియల్లో నటించింది మృణాల్. ఆ తర్వాత హిందీలో మరిన్ని ఆఫర్స్ అందుకుంది. ఆ తర్వాత హలో నందన్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. రాహుల్ జాదవ్ దర్శకత్వం వహించిన మరాఠీ భాషా చిత్రంలో ఆమె కథానాయికగా అరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ అందుకుంది.

Mrunal Thakur: మృణాల్ ఫేవరెట్ హీరో అతనేనట.. ఊహించని పేరు చెప్పిన ముద్దుగుమ్మ
Mrunal Thakur

Updated on: Feb 18, 2025 | 6:18 PM

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. జెర్సీ రీమేక్ సినిమాతో బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది మృణాల్ ఠాకూర్ ఆతర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. ఆతర్వాత సీతారామం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. 2022లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న మృణాల్. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించింది.

వీటిలో హాయ్ నాన్న సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాగా ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్ చిత్రం సీతారామం ద్వారా మలయాళీలకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా మృణాల్ కేరళలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన మలయాళ నటుడు ఎవరో చెప్పింది.

కేరళ పర్యటన సందర్భంగా, ప్రెజెంటర్ రంజిని హరిదాస్ మీకు ఇష్టమైన మలయాళ నటుడు ఎవరు.? అని అడిగారు. దుల్కర్ కాకుండా మీకు ఇష్టమైన మలయాళ నటుడు ఎవరు.? దీనికి మృణాల్ “మమ్మూట్టి” అని సమాధానం చెప్పింది.  ఆయన సినిమాలన్నీ నాకు ఇష్టం. ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ, అవన్నీ భిన్నంగా ఉంటాయి. మృణాల్ ఠాకూర్ మమ్ముట్టిని రాక్ స్టార్ అని తెలిపింది. కాగా 32 ఏళ్ల మృణాల్ ఠాకూర్ తన నట జీవితాన్ని సీరియల్స్ ద్వారా ప్రారంభించింది . మృణాల్ హీరోయిన్ గా 2014లో మరాఠీ చిత్రం హలో నందన్ లో నటించింది.. ఆమె మొదటి హిందీ చిత్రం లవ్ సోనియా, 2018లో విడుదలైంది. ఆ తర్వాత సూపర్ 30, జెర్సీ వంటి అద్భుతమైన చిత్రాలలో కనిపించిన మృణాల్, 2022 చిత్రం సీతారామంలో తన పాత్ర ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన ఆమె హీరోయిన్‌గా కనిపించింది. తెలుగులో విడుదలైన ఈ చిత్రం కేరళతో సహా ఇండియా అంతటా విజయవంతమైంది. తరువాత, మృణాల్ లస్ట్ స్టోరీస్ 2, హై నాన్నా, ది ఫ్యామిలీ స్టార్, అలాగే కల్కి సినిమాల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి